మారుతి సుజుకి ఇగ్నిస్‌ 2019 లాంచ్‌

Maruti Suzuki Launches New Ignis - Sakshi

సరికొత్త భద్రతా ఫీచర్లతో మారుతి ఇగ్నిస్‌ 2019

ప్రారంభ ధర రూ.4.79 లక్షలు

సాక్షి, ముంబై:  దేశీయ దిగ్గజ కార్ల తయారీ  సంస్థ మారుతి సుజుకి 2019 ఇగ్నిస్ కారును లాంచ్‌ చేసింది.  రూఫ్‌ రెయిల్స్‌ లాంటి సరికొత్త భద్రతా ఫీచర్లతోపాటు, ఇతర మార్పులతో అపడేటెడ్‌ వెర్షన్‌ను తాజాగా భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.  ఢిల్లీ ఎక్స్‌షోరూమ్ ధర రూ.4.79 లక్షల నుంచి 7.14 లక్షల మధ్య ఉండనుంది. 1.2 లీటర్‌ 4 సిలిండర్‌ ఇంజీన్‌ సామర్థ్యంతో పెట్రోలు వెర్షన్‌ను మాత్రమే ఆవిష్కరించింది. ఇది  సిగ్మా, డెల్టా, జీటా, అల్ఫా అనే నాలుగు వేరియంట్ల రూపంలో అందుబాటులో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. 

కొత్త ఇగ్నిస్ కారులో రివర్స్ పార్కింగ్ సెన్సర్స్, కో-డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్ వంటివి స్టాండర్డ్ ఫీచర్లుతోపాటు  డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్స్, 5 స్పీడ్ గేర్ బాక్స్  వంటి భద్రతా ఫీచర్లను అమర్చింది.

ప్రయాణికులకు మెరుగైన భద్రతా అందించాలనే లక్ష్యంతో పలు సేఫ్టీ ప్రత్యేకతలతో కొత్త ఇగ్నిస్ కారును తీసుకువచ్చామని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆస్‌.ఎస్.కల్సి తెలిపారు. ప్రీమియం అర్బన్ కార్ యూజర్లకు 2019 ఇగ్నిస్ ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా మారిందని పేర్కొన్నారు. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top