టాప్‌ గేర్‌లో మారుతీ డిజైర్‌ | Maruti Suzuki Dzire Is The Fastest Car To Cross 3 Lakh Sales Mark | Sakshi
Sakshi News home page

టాప్‌ గేర్‌లో మారుతీ డిజైర్‌

Oct 9 2018 12:49 AM | Updated on Oct 9 2018 12:49 AM

Maruti Suzuki Dzire Is The Fastest Car To Cross 3 Lakh Sales Mark - Sakshi

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) ఏడాదిన్నర కిందట విడుదల చేసిన డిజైర్‌ అప్‌డేటెడ్‌ వెర్షన్‌ అమ్మకాల్లో మరో మైలురాయిని అధిగమించింది. సరిగ్గా 17 నెలల కిందట మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ సబ్‌ కాంపాక్ట్‌ సెడాన్‌ కారు అమ్మకాలు 3 లక్షలు మించినట్లు కంపెనీ ప్రకటించింది.

గతేడాది మే నెలలో మూడవ జనరేషన్‌ డిజైర్‌గా మార్కెట్‌లో విడుదలైన ఈ కారు.. అంతకుముందు వెర్షన్‌ కంటే 28 శాతం అధిక అమ్మకాలతో దూసుకుపోతున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డెరైక్టర్‌ (మార్కెటింగ్, సేల్స్‌) ఆర్‌.ఎస్‌. కల్సి చెప్పారు. మొత్తం సేల్స్‌లో 25 శాతం అమ్మకాలు నూతన ఫీచర్లు కలిగిన హైఎండ్‌ కార్లు కాగా.. దాదాపు 20 శాతం అమ్మకాలు ఆటోమేటిక్‌ వేరియంట్‌వి ఉన్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement