కార్లు హోం డెలివరీ - మారుతి సుజుకి

Maruti reopens 600 dealerships : cars  home delivery  - Sakshi

లాక్‌డౌన్‌  సడలింపుల తర్వాత తెరుచుకున్న  600 డీలర్‌షిప్‌ లు

ఇంటి వద్దకే కార్ల డెలివరీ

సమగ్ర ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని (ఎస్ఓపీ) ఏర్పాటు 

సాక్షి, ముంబై : దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్‌ఐ) కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. కరోనావైరస్, లాక్‌డౌన్‌ మూసివేసిన 600 డీలర్‌షిప్‌లను తిరిగి తెరిచినట్లు బుధవారం తెలిపింది. వాహనాల డెలివరీలను కూడా ప్రారంభించింది. దీనికి సంబంధించిన స్టాక్ తమ దగ్గర వుందని సంస్థ వెల్లడించింది. ప్లాంట్ల కార్యకలాపాలు ప్రస్తుతానికి ఇంకా మొదలుకాలేదని ప్రకటించింది.  (కరోనా : అయ్యయ్యో మారుతి!)

కోవిడ్-19 మహమ్మారి కారణంగా వాహనాల కొనుగోలుకు సమగ్ర ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని (ఎస్ఓపీ) ఏర్పాటు చేశామని  తెలిపింది. అలాగే డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేశామని ఆటో మేజర్ తెలిపింది. దేశవ్యాప్తంగా 600 డీలర్‌షిప్‌లను తెరిచామని ఎంఎస్‌ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మార్కెటింగ్ అండ్ సేల్స్ శశాంక్ శ్రీవాస్తవ  చెప్పారు. గత కొన్ని రోజులుగా 55 యూనిట్లతో ఇప్పటికే కార్ల డెలివరీలను కంపెనీ ప్రారంభించిందని తెలిపారు. సంబంధిత అనుమతులు తప్పనిసరైన రాష్ట్రాల్లో డీలర్లు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. మొత్తం అమ్మకపు నెట్‌వర్క్‌లో కార్యకలాపాలను ప్రారంభంపై ప్రశ్నించినపుడు  ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎంత త్వరగా ఆమోదం వస్తుందనే దానిపై ఆధారపడి వుంటుందని శ్రీవాస్తవ స్పష్టం చేశారు. (కారు.. జీరో)

కంపెనీ సీఎండీ కెనిచి ఆయుకావా మాట్లాడుతూ కరోనా కట్టడికి సంబంధించి పూర్తి భద్రత, పరిశుభ్రత, శానిటైజేషన్ చర్యలను విధిగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. కొనుగోలు సమయలో షోరూమ్‌లను సందర్శించాల్సిన అవసరం లేకుండా వినియోగదారులకు సహాయపడేలా డిజిటల్ ప్రక్రియను కంపెనీ ఏర్పాటు చేసిందన్నారు. వాహనాల డెలివరీకి కూడా షోరూమ్‌లకు రావాల్సిన అవసరం లేకుండానే ఇంటివద్దకే పంపే ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అంతేకాకుండా డీలర్‌షిప్‌లు టెస్ట్ డ్రైవ్ వాహనాలను పూర్తి స్టెరిలైజేషన్‌ను చేపడతాయని చెప్పారు. కాగా దేశంలోని 1960 నగరాలు, పట్టణాల్లో సుమారు 3080 డీలర్‌షిప్‌లున్న ఈ సంస్థ 474 అరేనా అవుట్‌లెట్‌లు, 80 నెక్సా డీలర్‌షిప్‌లు, 45 వాణిజ్య వాహనాల అమ్మకపు దుకాణాలను తెరవగలిగింది. లాక్ డౌన్ ఆంక్షలు కారణంగా కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఏప్రిల్ నెలలో ఒక్క కారును కూడా విక్రయించలేకపోయింది.  (పెట్రోపై పన్ను బాదుడు)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top