భారత్‌కు మాల్యా : బిగ్‌ బ్రేక్‌

Mallya  UK High Court extradition appeal to be heard in February 2020   - Sakshi

మాల్యా అప్పగింత కేసు వచ్చే ఏడాదికి

2020, ఫిబ్రవరి 11కు వాయిదా వేసిన లండన్‌ కోర్టు

లండన్‌: భారత బ్యాంకులకు వేలకోట్ల  రూపాయల రుణాలు ఎగ్గొట్టి  లండన్‌కు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్‌ మాల్యా (63) ను స్వదేశం రప్పించే ప్రయత్నంలో మరో బ్రేక్‌ పడింది. మాల్యాను భారత్‌ అప్పగించే ఉత్తర్వుకు వ్యతిరేకంగా యుకె హైకోర్టులో మాల్యా  పెట్టుకున్న పిటిషన్‌పై  విచారణను వచ్చే ఏడాదికి వాయిదా వేసింది.  2020 ఫిబ్రవరి 11వ తేదీకి  ఈ విచారణను వాయిదా  వేస్తూ  కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  ఫిబ్రవరి 11 నుండి మూడు రోజులపాటు ఈ అంశంపై  విచారణ చేపట్టనున్నామని  లండన్‌ హైకోర్టు అధికారి ఒకరు తెలిపారు.

కాగా సుమారు  రూ. 9వేల కోట్లకు పైగా  బ్యాంకులకు బకాయి పడిన  కింగ్‌ఫిషర్‌ మాజీ అధినేత విజయ్‌ మాల్యాపై మనీలాండర్‌రింగ్‌ ఆరోపణలతో  ఈడీ, సీబీఐ దర్యాప్తు చేపట్టాయి. ఆర్థిక నేరగాడు మాల్యాను భారత్‌కు రప్పించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో మార్చి2, 2016న దేశంనుంచి పారిపోయిన మాల్యాను ఎట్టకేలకు  2017లో  లండన్‌ పోలీసుల సాయంతో మాల్యాను అరెస్ట్‌ చేసింది. ప్రస్తుతం మాల్యా బెయిల్‌పై ఉన్నాడు. అయితే  బ్యాంకుల నుంచి తీసుకొన్న రుణాలు 100శాతం చెల్లించడానికి సిద్దంగా ఉన్నా బ్యాంకులు మాత్రం ఆ డబ్బు తీసుకోవడంలేదని మాల్యా  వాదిస్తున్న సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top