మహీంద్ర స‍్కార్పియో కొత్త వేరియంట్‌

Mahindra launches new Scorpio variant priced at Rs 13.99 lakh - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీదారు  మహీంద్ర అండ్‌ మహీంద్ర తన పాపులర్‌ మోడల్‌లో  కొత్త వేరియట్‌ను తీసుకొచ్చింది. స్కార్పియో ఎస్‌యూవీలో ఎస్‌9 పేరుతో ఈ సరికొత్త వేరియంట్‌ను సోమవారం విడుదల చేసింది. అంతేకాదు కీలక ఫీచర్లతో స్కార్పియో ఎస్‌ 11 కంటే తక్కువ ధరకే దీన్ని వినియోగదారులకు అందిస్తోంది.  మహీంద్ర  స్కార్పియో ఎస్‌ 9 ఎస్‌యూవీ ధరను రూ. 13.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా  నిర్ణయించింది.  దేశవ్యాప్తంగా  తమ డీలర్ల దగ్గర ఈ వాహనం తక్షణమే అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

2.2-లీటర్ టర్బోడీజిల్ ఇంజీన్‌ కెపాసిటీ, 140 హెచ్‌పీ వద్ద 320 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్‌, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డ్యుయల్‌ ఎయిర్‌ బ్యాగ్స్‌, 5.9 ఇంచెస్‌ టచ్‌స్ర్కీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. అలాగే స్టీరింగ్ వీల్‌పై ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్‌తోపాటు, ఆడియో,  క్రూయిస్ కంట్రోల్ బటన్లను అమర్చింది.

ఇక మార్కెట్లో పోటీ విషయానికి వస్తే.. టాటా హెక్సాతో గట్టి పోటీ  ఇవ్వనుందని అంచనా.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top