బొలెరో విక్రయాల్లో 12 శాతం వృద్ధి

Mahindra And Mahindra Bolero 12 Percent Growth in pickups - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఈ ఆర్థిక సంవత్సరంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) వాణిజ్య వాహనమైన బొలెరో అమ్మకాల్లో 12 శాతం వృద్ధిని లకి‡్ష్యంచింది. గత ఆర్థిక సంవత్సరంలో 1.62 లక్షల వాహనాలను, 2018 ఆర్ధికంలో 1.49 లక్షలను విక్రయించామని.. ఏడాదిలో 9 శాతం వృద్ధిని నమోదు చేశామని ఎం అండ్‌ ఎం వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెటింగ్‌– ఆటోమోటివ్‌ డివిజన్‌) విక్రమ్‌ గార్గా తెలిపారు. మంగళవారం కొత్త బొలెరో క్యాంపర్‌ను విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య వాహన శ్రేణిలో బొలెరో ఫ్లాగ్‌షిప్‌ బ్రాండ్‌ అని, 86 శాతం మార్కెట్‌ వాటా దీని సొంతమని ఆయన తెలిపారు. 

3 రకాలు; ధర రూ.7.28 లక్షలు
క్యాంపర్‌ నాన్‌ ఏసీ, క్యాంపర్‌ 4డబ్ల్యూడీ, క్యాంపర్‌ గోల్డ్‌ వీఎక్స్‌ మూడు వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్‌ ప్రారంభ ధర రూ.7.28 లక్షలు.  మూడేళ్లు లేదా లక్ష కి.మీ. వరకూ వారంటీ ఇస్తుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top