ఫార్మాలో 1,000 మందికి లుపిన్‌ శిక్షణ

Lupine training for 1,000 people in Forma - Sakshi

రూ.20 కోట్ల వ్యయం

పనాజీ: ‘లెర్న్‌ అండ్‌ ఎర్న్‌’ కార్యక్రమంలో భాగంగా వచ్చే రెండేళ్లలో 1,000 మంది సైన్స్‌ విద్యార్ధులకు ఫార్మా రంగంలో శిక్షణ ఇవ్వనున్నట్లు లుపిన్‌ ప్రకటించింది. ప్లెస్‌ 12 (ఇంటర్‌)లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్ధులకు మూడేళ్ల ఫార్మా రంగంలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. ‘2011 నుంచి ఇప్పటివరకు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 560 మంది విద్యార్ధులకు శిక్షణనిచ్చాం. 2020 నాటికి మరో 1,000 మంది ప్లెస్‌ 12 పూర్తిచేసిన వారికి మూడేళ్ల ఫార్మా డిగ్రీ కోర్సును అందించనున్నాం.

గోవా, ఇండోర్, సిక్కింలతో పాటు మహారాష్ట్రలోని తారాపూర్, ఔరంగాబాద్‌లోని ఫెసిలిటీలలో శిక్షణ ఉంటుంది.’ అని సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (హెచ్‌ఆర్‌) సీ శ్రీనివాసలు అన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం కోసం రూ.20 కోట్లు వ్యయం అవుతుందని అంచనావేసినట్లు ప్రెసిడెంట్‌ (హెచ్‌ఆర్‌) యశ్వంత్‌ మహాదిక్‌ వెల్లడించారు. కోర్సు తరువాత రెండేళ్లు లుపిన్‌లో పనిచేయవలసి ఉంటుందని తెలిపారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top