విమానయాన సంస్థలతో తల్వార్‌ లింకులపై దర్యాప్తు

Lobbyist Talwar bribed public servants to help foreign airlines - Sakshi

న్యూఢిల్లీ: కార్పొరేట్‌ లాబీయిస్ట్‌ (వ్యవహారాల నేర్పరి) దీపక్‌ తల్వార్‌కు దేశ, విదేశాలకు చెందిన 50 సంస్థలతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు ఏజెన్సీలు దృష్టి సారించాయి. తన విదేశీ క్లయింట్లకు అనుకూలంగా ఎయిర్‌ ట్రాఫిక్‌ హక్కులను సంపాదించేందుకు గాను ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయనేతలకు తల్వార్‌ లంచాలు ఇచ్చినట్టు.. తద్వారా విమానయాన సంస్థల నుంచి తల్వార్‌కు రూ.272 కోట్లు ముట్టినట్టు దర్యాప్తు నివేదిక స్పష్టం చేస్తోంది. యూపీఏ హయాంలో తల్వార్‌ లాబీయింగ్‌ వ్యవహారాలు, ముఖ్యంగా విమానయాన రంగానికి సంబంధించిన వాటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్, సీబీఐ దర్యాప్తు చేస్తున్నాయి. ప్రస్తుతం తల్వార్‌ జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నాడు. ఈ ఆరోపణలను ఆయన ఖండించడం గమనార్హం. ఎయిర్‌ఇండియా ప్రయోజనాలకు గండికొట్టి.. 2008–09లో మూడు విదేశీ విమానయాన కంపెనీలకు అనుకూలంగా ట్రాఫిక్‌ హక్కులను తల్వార్‌ సంపాదించిపెట్టినట్టు దర్యాప్తు ఏజెన్సీలు అభియోగాలు మోపాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top