12 సెన్సెక్స్ షేర్లలో పెరిగిన ఎల్‌ఐసీ వాటా | LIC buys shares worth Rs 16400 cr in 12 Sensex companies | Sakshi
Sakshi News home page

12 సెన్సెక్స్ షేర్లలో పెరిగిన ఎల్‌ఐసీ వాటా

May 18 2015 2:36 AM | Updated on Sep 3 2017 2:14 AM

12 సెన్సెక్స్ షేర్లలో పెరిగిన ఎల్‌ఐసీ వాటా

12 సెన్సెక్స్ షేర్లలో పెరిగిన ఎల్‌ఐసీ వాటా

ఎల్‌ఐసీ జనవరి-మార్చి క్వార్టర్లో 12 సెన్సెక్స్ షేర్లలో తన వాటాను పెంచుకుంది.

రూ.16,400 కోట్లు షేర్ల కొనుగోలు   
- జనవరి-మార్చి క్వార్టర్‌కు

న్యూఢిల్లీ: ఎల్‌ఐసీ జనవరి-మార్చి క్వార్టర్లో 12 సెన్సెక్స్ షేర్లలో తన వాటాను పెంచుకుంది. ఈ వాటా పెంపు కోసం రూ.16,400 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసింది. మరోవైపు ఇదే క్వార్టర్లో మరో 12 సెన్సెక్స్ షేర్లలో వాటాను తగ్గించుకుంది. రూ.6,730 కోట్ల విలువైన షేర్లను విక్రయించింది. గత కొన్ని క్వార్టర్లుగా యాక్సిస్ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలివర్ కంపెనీల్లో ఎల్‌ఐసీకి ఎలాంటి వాటా లేదు.

ఇక టాటా స్టీల్, భెల్, వేదాంత, టాటా మోటార్స్ కంపెనీల్లో ఎల్‌ఐసీ వాటాల్లో ఎలాంటి మార్పు లేదు. కోల్ ఇండియాలో అత్యధికంగా తన వాటాను పెంచుకుంది. కోల్ ఇండియా ఆఫర ఫర్ సేల్‌లో రూ.10,754 కోట్ల విలువైన షేర్లను (4.51 శాతం వాటాను) కొనుగోలు చేసింది. ఈ ఆఫర్ ఫర్ సేల్‌లో దాదాపు సగం ఎల్‌ఐసీనే కొనుగోలు చేసింది. సెన్సెక్స్ కంపెనీల్లో ఎల్‌ఐసీకి అత్యధిక వాటా ఉన్న కంపెనీగా ఎల్ అండ్ టీ నిలిచింది. ఎల్ అండ్ టీలో సెన్సెక్స్‌కు 16.7 శాతం వాటా ఉంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement