అద్భుత ఫీచర్లతో లెనోవో సెన్సేషనల్‌ స్మార్ట్‌ఫోన్‌

Lenovo Z6 Pro To Be Announced On March 27 VP Chang Cheng Reveals - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చైనా మొబైల్‌ మేకర్‌ మరో విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. జెడ్‌ సిరీస్‌లో భాగంగా అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో జెడ్‌6 ప్రొ పేరుతో లెనోవో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో లాంచ్‌ చేయనుంది.  100 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ హైపర్‌ విజన్‌ కెమెరాతోపాటు, ఎలక్షన్‌ సందర్భంగా ఫేక్‌న్యూస్‌ను అడ్డుకునేందుకు తీసుకొచ్చిన ఫేస్‌బుక్‌ కొత్త టూల్‌, వాట్సాప్‌  డార్క్‌మోడ్‌ అథెంటిఫికేషన్ను కూడా ఏర్పాటు చేసిన‌ట్లు తెలిసింది. 100ఎంపీ కెమెరా సామర్థ్యం ఉన్న తొలి ఫోన్‌ ఇదే కానుంది. 

ఈ మేర‌కు ఈ ఫోన్‌కు చెందిన ఓ ఇమేజ్‌ను, వీడియోను ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ చాంగ్ చెంగ్  మార్చి 27వ తేదీన చైనా సోష‌ల్ మీడియా వైబోలో పోస్ట్ చేశారు.ఈ ఏడాది మొబైల్‌ వరల్డ్‌కాంగ్రెస్‌లో దీనిపై ప్రకటించిన సంస్థ జూన్‌ నెలలో మార్కెట్లలో తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫీచర్లపై ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ, అంచనాలు ఇలా ఉన్నాయి.  

స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్  12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌  ప్రధానంగా వెలుగులోకి వచ్చిన లెనోవో జ‌డ్‌6 ప్రొ ఫీచర్లు.
 


 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top