లావా 3జీ కాలింగ్ ట్యాబ్లెట్ @ రూ.8,499 | Lava launches 3G calling tablet for Rs 8499 | Sakshi
Sakshi News home page

లావా 3జీ కాలింగ్ ట్యాబ్లెట్ @ రూ.8,499

Apr 28 2014 1:16 AM | Updated on Sep 2 2017 6:36 AM

లావా 3జీ కాలింగ్ ట్యాబ్లెట్ @ రూ.8,499

లావా 3జీ కాలింగ్ ట్యాబ్లెట్ @ రూ.8,499

దేశీ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ సంస్థ లావా... 3జీ కాలింగ్ ట్యాబ్లెట్ ‘ఐవరీ ఎస్’ను విడుదల చేసింది.

న్యూఢిల్లీ: దేశీ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ సంస్థ లావా... 3జీ కాలింగ్ ట్యాబ్లెట్ ‘ఐవరీ ఎస్’ను విడుదల చేసింది. దీని ధర రూ.8.499. 7 అంగుళాల స్క్రీన్ సైజు, డ్యూయల్ సిమ్ కలిగిఉన్న ఈ ట్యాబె ్లట్ బరువు 300 గ్రాములుగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. మీడియాటెక్ 1.3 గిగాహెర్ట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 4 జీబీ అంతర్గత మెమరీ(32 జీబీ ఎక్స్‌పాండబుల్) వంటి కీలక సాంకేతికాంశాలు ఉన్నాయి.

ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ట్యాబ్లెట్‌కు వెనుకవైపున 3.2 మెగాపిక్సెల్స్ కెమెరా, ముందువైపున వీజీఏ కెమేరా(3జీ వీడియో కాలింగ్), 2,800 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం తదితర ఫీచర్లు ఉన్నట్లు లావా ఇంటర్నేషనల్ సహవ్యవస్థాపకుడు, డెరైక్టర్ ఎస్‌ఎన్ రాయ్ వివరించారు. యువత, యువ ప్రొఫెషనల్స్‌ను ఆకట్టుకునే లక్ష్యంగా ఒపేరా, హంగామా మ్యూజిక్, వాట్స్‌యాప్, పేటీఎం, ఈఏ గేమ్స్ తదితర ప్రీలోడెడ్ యాప్స్, గేమ్స్‌ను ఇందులో పొందుపరిచినట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement