డిజిటల్ ఇన్సూరెన్స్‌పై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీ కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రకటించింది.
ప్రీమియర్ లైఫ్ పేరుతో కొత్త పథకం...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ ఇన్సూరెన్స్‌పై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీ కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రకటించింది. పాలసీలు విక్రయం దగ్గర నుంచి అన్ని లావాదేవీలు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ మీద అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కోటక్ లైఫ్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ సురేష్ అగర్వాల్ తెలిపారు. ఏడాదిలో వ్యాపారంలో 70 నుంచి 80% డిజిటల్ చానల్స్ ద్వారా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలి పారు. అంతకుముందు 99 ఏళ్లు బీమా రక్షణ కల్పించే హోల్‌లైఫ్ ప్లాన్ ‘ప్రీమియర్ లైఫ్’ను మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేశారు.