breaking news
Kotak Life
-
పాలసీ దారులకు షాక్?
టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియంను పెంచాలనుకుంటున్నట్టు కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ మహేష్ బాలసుబ్రమణియన్ తెలిపారు. నూతన పాలసీకి అనుమతి కోసం త్వరలోనే బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ముందు దరఖాస్తు చేసుకోనున్నట్టు చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా బీమా సంస్థలు, బీమాపై బీమాను ఆఫర్ చేసే సంస్థలు (రీఇన్సూరెన్స్) తీవ్రంగా ప్రభావితమైనట్టు చెప్పారు. తమ ఉత్పత్తుల ప్రీమియం ధరలు, అండర్‌రైటింగ్ (చెల్లింపుల బాధ్యతను స్వీకరించడం) నిబంధనలను మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడినట్టు వివరించారు. గడిచిన కొన్ని నెలలుగా భారీ ఎత్తున క్లెయిమ్‌లు రావడంతో ఇప్పటికే చాలా కంపెనీలు టర్మ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తుల ప్రీమియంను పెంచినట్టు చెప్పారు. ‘‘చివరిగా మేము గతేడాది ఏప్రిల్‌లో ప్రీమియం పెంచాము. పరిస్థితులను మదింపు వేసిన అనంతరం నూతన ఉత్పత్తి కోసం దరఖాస్తు చేసుకుంటాము’’ అని చెప్పారు. ధరల పెంపు కాకుండా, వాస్తవ పరిస్థితులను ప్రతిఫలించేలా తమ ఉత్పత్తి ఉంటుందన్నారు. 2021–22 మొదటి ఆరు నెలల్లో 62,828 క్లెయిమ్‌లకు సంబంధించి రూ.1,230 కోట్లను ఈ సంస్థ చెల్లించడం గమనార్హం. చదవండి: మరణించినా, జీవించి ఉన్నా ప్రయోజనం.. కొత్త టర్మ్ ప్లాన్ వివరాలు -
డిజిటల్ ఇన్సూరెన్స్‌పై కోటక్లైఫ్ దృష్టి
ప్రీమియర్ లైఫ్ పేరుతో కొత్త పథకం... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ ఇన్సూరెన్స్‌పై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీ కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రకటించింది. పాలసీలు విక్రయం దగ్గర నుంచి అన్ని లావాదేవీలు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ మీద అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కోటక్ లైఫ్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ సురేష్ అగర్వాల్ తెలిపారు. ఏడాదిలో వ్యాపారంలో 70 నుంచి 80% డిజిటల్ చానల్స్ ద్వారా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలి పారు. అంతకుముందు 99 ఏళ్లు బీమా రక్షణ కల్పించే హోల్‌లైఫ్ ప్లాన్ ‘ప్రీమియర్ లైఫ్’ను మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేశారు.