వీటి గురించీ తెలుసుకోండి.. | know about this special claims | Sakshi
Sakshi News home page

వీటి గురించీ తెలుసుకోండి..

Sep 5 2016 12:43 AM | Updated on Sep 4 2017 12:18 PM

వీటి గురించీ తెలుసుకోండి..

వీటి గురించీ తెలుసుకోండి..

ప్రస్తుత హెల్త్ పాలసీ రూ.2 లక్షలకు ఉంది. దానిపై నో క్లెయిమ్ బోనస్ రూపంలో రూ.50వేలు కలిసి ఉందనుకుంటే...

నో క్లెయిమ్ బోనస్ సంగతేంటి?
ప్రస్తుత హెల్త్ పాలసీ రూ.2 లక్షలకు ఉంది. దానిపై నో క్లెయిమ్ బోనస్ రూపంలో రూ.50వేలు కలిసి ఉందనుకుంటే... పోర్టబిలిటీలో కొత్త బీమా కంపెనీ రూ.2.5 లక్షలకు బీమా కవరేజీ ఇస్తుంది. ప్రీమియం కూడా అంత మేర చెల్లించాల్సి ఉంటుంది.

 దరఖాస్తు తిరస్కరణ
పోర్టబులిటీ దరఖాస్తును కచ్చితంగా ఆమోదించాలనేమీ నిబంధనల్లేవు. పోర్టబిలిటీ దరఖాస్తు అయినప్పటికీ దాన్ని నూతన దరఖాస్తుగా భావించి బీమా కంపెనీ నియమ నిబంధనల మేరకు దాన్ని అన్ని విధాలుగా పరిశీలిస్తుంది. చివరికి పాలసీ ఇవ్వడం రిస్క్ అని భావిస్తే దరఖాస్తును తిరస్కరించవచ్చు. లేదంటే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరవచ్చు.

 15 రోజుల్లోపే తేల్చాలి...
పోర్టబిలిటీకి దరఖాస్తు చేసుకున్నారు. కంపెనీ కోరిన అన్ని రకాల పత్రాలూ సమర్పించారు. దానిపై నిర్ణయాన్ని నిబంధనల మేరకు బీమా కంపెనీ 15 రోజుల్లోగా తెలియజేయాలి. ఆ లోపు తెలియజేయక పోతే పోర్టబిలిటీని ఆమోదించినట్లే లెక్క. 15 రోజుల తరవాత తిరస్కరించే అవకాశం లేదు.

కవరేజీ పెరిగితే...
పోర్టబిలిటీ సదుపాయంలో భాగంగా బీమా కవరేజీ పెరిగితే నిబంధనలు మారిపోవచ్చు. ఉదాహరణకు ప్రస్తుత పాలసీ రూ.2లక్షలే. పోర్టబిలిటీలో భా గంగా మారే బీమా కంపెనీలో కనీస పాలసీ రూ.5 లక్షలు ఉందనుకోండి. అప్పుడు కచ్చితంగా రూ.5 లక్షలు తీసుకోక తప్పదు. అలాంట ప్పుడు పాత పాలసీలోని నిరీక్షణ కాలం బదిలీ కాదు.

 ఏ డాక్యుమెంట్లు ఇవ్వాలంటే...
ప్రస్తుత పాలసీ పత్రం, నో క్లెయిమ్ బోనస్‌పై స్వీయ ధ్రువీకరణ, ఒకవేళ క్లెయిమ్ ఉంటే ఆస్పత్రిలో ఇచ్చిన డిశ్చార్జ్ సమ్మరీ, వైద్య పరీక్షలు, ఫాలో అప్ రిపోర్టు కాపీలను కూడా సమర్పించాల్సి ఉంటుంది. కంపెనీ అదనంగా ఏవైనా కోరినా అందించాలి. ఇలా పోర్టబిలిటీ దరఖాస్తుకు కావాల్సిన పత్రాలన్నీ జత చేసి సమర్పించిన తర్వాత... దరఖాస్తు దారుడి వైద్య చరిత్ర, క్లెయిమ్ చరిత్ర గురించి కంపెనీ సమాచారాన్ని కోరవచ్చు. ఇదంతా ఐఆర్‌డీఏ వెబ్ పోర్టల్ ద్వారా జరుగుతుంది. ఇలా కోరిన 7 రోజుల్లోగా పాత కంపెనీ సమాచారాన్ని అందించాల్సి ఉంటుం ది. ఈ వివరాలు అందిన వెంటనే నిబంధనల మేరకు దరఖాస్తును పరిశీలించి తన నిర్ణయాన్ని దరఖాస్తు అందిన దగ్గర నుంచి 15 రోజుల్లోపు తెలియజేయాల్సి ఉంటుంది. పోర్టబులిటీ సేవలు పూర్తిగా ఉచితం, ఎలాంటి  చార్జీలు విధించడానికి వీల్లేదు.

అనుకూలతలు
మరో కంపెనీలో మంచి సేవలు లభిస్తుంటే

సరసమైన ప్రీమియానికే మంచి సదుపాయాలతో పాలసీ వస్తుంటే

భవిష్యత్తు అవసరాలను తీర్చే స్థాయిలో తగినంత కవరేజీతో చౌకగా వస్తుంటే.

ప్రతికూలతలు
పోర్టబులిటీ ద్వారా వచ్చే కస్టమర్‌కు పాలసీ ఇచ్చేముందు కంపెనీలు పూర్తిగా పరిశీలిస్తాయి. రిస్క్ ఉందనుకుంటే ఆ మేరకు ప్రీమియం పెంచుతాయి.

పాత కంపెనీలోని నో క్లెయిమ్ బోనస్ కొత్త కంపెనీకి వాస్తవికంగా బదిలీ కాదు. కవరేజీ పెంచుతారు.

ఆ మేరకు అదనపు ప్రీమియం చెల్లించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement