కియా తొలి ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌

Kia motors launches BEAT360 brand experience centre in India - Sakshi

‘బీట్‌ 360’ పేరుతో గురుగ్రామ్‌లో ఏర్పాటు

సెప్టెంబర్‌ దేశీ అమ్మకాలు 7,554 యూనిట్లు

గురుగ్రామ్‌: దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటార్స్‌.. తాజాగా తన తొలి ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను ప్రారంభించింది. ‘బీట్‌ 360’ పేరుతో 5,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సెంటర్‌ను ఇక్కడ ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా సంస్థ ఎండీ, సీఈఓ కూక్‌ హున్‌ షిమ్‌ మాట్లాడుతూ.. ‘కియా భవిష్యత్‌ వ్యూహాలను ఈ సెంటర్‌ వివరిస్తుంది. భారత్‌లో నూతన ప్రామాణాలను ఏర్పాటుచేయడంలో కీలక పాత్ర పోషించనుంది. భారత్‌లో సంస్థ కార్యకలాపాలు ప్రారంభించిన దగ్గర నుంచి వినియోగదారులు మా సంస్థపైనే దృష్టి సారిస్తున్నారు.

నిజమైన కియా అనుభవాన్ని అందించడానికి వీరితో అనుసంధానం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక ఈ సెంటర్‌ పేరులోని మొదటి పదం బీటింగ్‌ ఆఫ్‌ హార్డ్‌కు సంక్షిప్తం. సంస్థ వ్యాపార ప్రాంతాలు (జోన్స్‌)కు సంకేతంగా 3, ఇంద్రియాలను సూచిస్తూ 6, హద్దులు లేవని చెప్పేందుకు 0 ఎంపిక చేసి 360 అని నిర్ణయించాం. త్వరలోనే దేశంలోని మెట్రో నగరాల్లో కూడా ఇటువంటి సెంటర్లను ఏర్పాటుచేయాలని యోచిస్తున్నాం. అని వ్యాఖ్యానించారు.

50,000 బుకింగ్స్‌: సెప్టెంబర్‌ నెలలో కియా దేశీ అమ్మకాలు 7,554 యూనిట్లు కాగా, కారు విడుదలైన ఆగస్టు 22 నుంచి గతనెల చివరివరకు మొత్తం విక్రయాలు 13,990 యూనిట్లుగా నమోదయ్యాయి. బుకింగ్స్‌ 50,000 యూనిట్ల మార్కును అధిగమించాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top