
ఫైల్ ఫోటో
ఆభరణాల రిటైల్ చెయిన్ కళ్యాణ్ జ్యూయలర్స్ హైదరాబాద్‌లో తన మూడవ షోరూమ్‌ను ప్రారంభించనుంది. ఈ నెల 21న (బుధవారం) ఏ.ఎస్ రావునగర్‌లో సంస్థ బ్రాండ్ అంబాసిడర్ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ఉదయం 11 గంటలకు షోరూమ్ ప్రారంభోత్సవం జరగనుందని వెల్లడించింది. అంతర్జాతీయంగా ఇది 138 షోరూమ్ కానుండగా, తెలంగాణలో నాలుగవ షోరూమ్ అని కంపెనీ చైర్మన్, ఎండీ టీ ఎస్ కళ్యాణరామన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రారంభోత్సవంలో భాగంగా మేకింగ్ చార్జీలపై 3 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. కోటి రూపాయిల వరకు ఇన్‌స్టెంట్ రిడీమ్ వోచర్లను ఇస్తున్నాం. ఇంతేకాకుండా, వీక్లీ బంపర్ బహుమతిలో లక్ష రూపాయిల ఆభరణాలను అందిస్తున్నాం’ అని వెల్లడించారు.