హావ్ ఇట్ నుంచి ఆల్కలైన్ జగ్.. | Jug from the alkaline Have It | Sakshi
Sakshi News home page

హావ్ ఇట్ నుంచి ఆల్కలైన్ జగ్..

May 18 2016 1:20 AM | Updated on Sep 4 2017 12:18 AM

హావ్ ఇట్ నుంచి ఆల్కలైన్ జగ్..

హావ్ ఇట్ నుంచి ఆల్కలైన్ జగ్..

హావ్ ఇట్ బ్రాండ్‌తో ఆల్కలైన్ సొల్యూషన్స్ రంగంలో ఉన్న బ్లూ వాటర్ తాజాగా ఆల్కలైన్ జగ్‌ను ప్రవేశపెట్టింది.

త్వరలో మరో మూడు ఉత్పత్తులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హావ్ ఇట్ బ్రాండ్‌తో ఆల్కలైన్ సొల్యూషన్స్ రంగంలో ఉన్న బ్లూ వాటర్ తాజాగా ఆల్కలైన్ జగ్‌ను ప్రవేశపెట్టింది. ఆర్‌వో వాటర్ ప్యూరిఫయర్లను వాడుతున్న కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని కంపెనీ దీనిని తీసుకొచ్చింది. నీటి నిల్వ సామర్థ్యం 2.5 లీటర్లు. రెండు నిముషాల్లో జగ్ నిండుతుంది. కార్‌ట్రిడ్జ్ 4,000 లీటర్లపైనే అందిస్తుందని కంపెనీ తెలిపింది. ధర రూ.4,250. ఇప్పటికే గృహ వినియోగదారుల కోసం ఆల్కలైన్ ఆర్‌వో, కార్యాలయాల కోసం ఆల్కలైన్ డిస్పెన్సర్‌ను విక్రయిస్తున్నామని బ్లూ వాటర్ ఫౌండర్ కలిశెట్టి నాయుడు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు.

త్వరలో మరో మూడు ఉత్పత్తులను మార్కెట్లోకి తెస్తామని చెప్పారు. ‘నీటిని స్వచ్ఛపరిచేందుకు ఆర్‌వో విధానం బాగా పనిచేస్తుంది. అయితే కాల్షియం, మెగ్నీషియం వంటి మనిషికి ఆవశ్యకమైన లవణాలన్నీ ఈ ప్రక్రియలో తొలగిపోతాయి. అదే ఆల్కలైన్ విధానంలో కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం తగు మోతాదులో ఉంటాయని కంపెనీ సహ వ్యవస్థాపకులు డి.పి.రాయ్ వెల్లడించారు. అలాగే పీహెచ్ విలువ 7 కంటే ఎక్కువగా ఉంటుందని చెప్పారు.

Advertisement
Advertisement