మార్కెట్‌లోకి రేంజ్‌ రోవర్‌ ఎవోక్‌ కన్వర్టిబుల్‌

JLR launches Range Rover Evoque Convertible at Rs69.53 lakh - Sakshi

ధర రూ.69.53 లక్షలు

న్యూఢిల్లీ: దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టాటా మోటార్స్‌’ అనుబంధ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) ఇండియా తాజాగా రేంజ్‌ రోవర్‌ ఎవోక్‌ కన్వర్టిబుల్‌ ఎస్‌యూవీని మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.69.53 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌ ఇండియా). ఇది హెచ్‌ఎస్‌ఈ డైనమిక్‌ వేరియంట్‌ రూపంలో మాత్రమే కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది.ఈ కొత్త 2 డోర్‌ లగ్జరీ కన్వర్టిబుల్‌ ఎస్‌యూవీలో 9 స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన 2 లీటర్‌ ఇంజినియం పెట్రోల్‌ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది.

భారతదేశపు మొట్టమొదటి లగ్జరీ ఎస్‌యూవీ కన్వర్టిబుల్‌ను మార్కెట్‌లోకి తీసుకురావడం సంతోషంగా ఉందని జేఎల్‌ఆర్‌ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోహిత్‌ సూరి తెలిపారు. ప్రతికూల పరిస్థితుల్లో స్థిరమైన వేగంతో వెళ్లేందుకు వీలుగా ఇందులో ఆల్‌ టెరైన్‌ ప్రోగ్రెస్‌ కంట్రోల్‌ (ఏటీపీసీ) సిస్టమ్‌ను అమర్చామని పేర్కొన్నారు. అలాగే ఈ కారులో సరౌండ్‌ కెమెరా వ్యవస్థను పొందుపరిచామని తెలిపారు. దీనిసాయంతో వాహనం బయట చుట్టూ దగ్గరిగా 360 డిగ్రీల్లో చూడొచ్చన్నారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top