జాగ్వార్ ఎక్స్‌జే @ రూ. 93.24 లక్షలు | JLR launches locally produced Jaguar XJ 2.0 at Rs93.24 lakh | Sakshi
Sakshi News home page

జాగ్వార్ ఎక్స్‌జే @ రూ. 93.24 లక్షలు

Sep 17 2014 12:46 AM | Updated on Sep 2 2017 1:28 PM

జాగ్వార్ ఎక్స్‌జే @ రూ. 93.24 లక్షలు

జాగ్వార్ ఎక్స్‌జే @ రూ. 93.24 లక్షలు

టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ దేశీయంగా తయారు చేసిన జాగ్వార్ ఎక్స్‌జే 2.0 ఎల్ లగ్జరీ కారును మంగళవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ దేశీయంగా తయారు చేసిన జాగ్వార్ ఎక్స్‌జే 2.0 ఎల్ లగ్జరీ కారును మంగళవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ పెట్రోల్ లగ్జరీ సలూన్ ధర రూ.93.24 లక్షలని (ఎక్స్ షోరూమ్, ముంబై) జేఎల్‌ఆర్ వైస్ ప్రెసిడెంట్ రోహిత్ సూరి తెలిపారు. ఈ సెగ్మెంట్లో 2.0 లీ. పెట్రోల్ ఇంజిన్‌తో దేశీయంగా తయారైన లగ్జరీ కారు ఇదేనని వివరించారు.

 పుణే ప్లాంట్‌లో తయారు చేసిన ఈ కారులో వివిధ లగ్జరీ ఫీచర్లున్నాయని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో వెనకవైపు సీట్లను అడ్జెస్ట్ చేసుకోవచ్చని, మూడు ఇంటెన్సిటీ సెట్టింగ్‌లతో కూడిన మస్సాజ్ ఫంక్షన్ కూడా ఉందని, వెనక భాగంలో అధికమైన హెడ్‌రూమ్, 10 అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్లు రెండు(ముందు సీట్ల వెనక భాగంలో), ఎలక్ట్రిక్ రియర్ సైడ్ విండో బ్లైండ్స్, 825 వాట్‌ల మెరిడియన్ ఆడియో సిస్టమ్, ఎల్‌ఈడీ రీడింగ్ లైట్లు, వెనక వరుసలో బిజినెస్ టేబుళ్లు తదితర ఫీచర్లున్నాయని వివరించారు. ఈ ఏడాది మొదట్లో దేశీయంగా తయారు చేసిన జాగ్వార్ ఎక్స్‌జే 3.0లీ. డీజిల్ లగ్జరీ కారును అందించామని పేర్కొన్నారు. ఆ కారుకు మంచి స్పందన వస్తోందని, ఆ ఉత్సాహాంతోనే తాజాగా ఈ కారును అందిస్తున్నామని రోహిత్ సూరి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement