జియోరైల్‌ యాప్‌తో విలువైన సేవలు

Jiorail App From Jiostore - Sakshi

హైదరాబాద్‌ : తమ వినియోగదారులకు రైలు టికెట్లు బుక్‌ చేసుకోవడం, రద్దు చేసుకోవడం వంటి సేవలను అందించేందుకు జియోరైల్‌ యాప్‌ను రిలయన్స్‌ జియో అందుబాటులోకి తీసుకువచ్చింది. జియోరైల్‌ యాప్‌ ద్వారా ఏ జియో ఫోన్‌తో అయినా ఐఆర్‌సీటీసీ రిజర్డ్వ్‌ టికెట్‌ బుకింగ్‌ సేవలను వినియోగించుకోవచ్చు.

ఈ యాప్‌ ద్వారా వినియోగదారులు తమ డెబిట్‌ కార్డ్‌, క్రెడిట్‌ కార్డ్‌తో పాటు ఈ వ్యాలెట్‌ ఉపయోగించి టికెట్లు బుక్‌ చేసుకోవడం, రద్దు చేసుకోవడం వంటి సేవలను పొందవచ్చు. పీఎన్‌ఆర్‌ స్టేటస్‌ తెలుసుకోవడం, రైళ్ల రాకపోకల వేళలు, రూట్లు, అందుబాటులో ఉన్న సీట్లు వంటి పలు సేవలను జియో ఫోన్‌ ద్వారా వినియోగదారులు పొందే వెసులుబాటు కల్పించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top