జియో ఎఫెక్ట్‌ : ఆ నోకియా ఫోన్‌లోకి వాట్సాప్‌

JioPhone Effect: Nokia 8110 4G  To Get WhatsApp Support - Sakshi

న్యూఢిల్లీ : ముఖేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియో కంపెనీ తన జియోఫోన్‌లో మూడు పాపులర్‌ యాప్స్‌ వాట్సాప్‌, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌లను అందించనున్నట్టు ప్రకటించగానే.. మిగతా ఫీచర్‌ ఫోన్‌ యూజర్లు కూడా జియోతో పోటీకి సిద్ధమవుతున్నాయి. జియో దెబ్బకు హెచ్‌ఎండీ గ్లోబల్‌ కూడా తన బనానా ఫోన్‌ నోకియా 8110  4జీ లో వాట్సాప్‌ అందించనున్నట్టు తెలిపింది. త్వరలోనే వాట్సాప్‌ సపోర్టును ఇవ్వనున్నట్టు తెలుపుతూ నోకియా బ్రాండెడ్‌ స్మార్ట్‌ఫోన్ల తయారీదారి హెచ్‌ఎండీ గ్లోబల్‌ టీజ్‌చేసింది. నోకియా ఈ ఫోన్‌ కూడా.. జియో ఫోన్‌ మాదిరి కిఓఎస్‌తో పనిచేస్తోంది. 2018 ఎండబ్ల్యూసీ ఈ ఫోన్‌ హెచ్‌ఎండీ గ్లోబల్‌ లాంచ్‌ చేసింది.  

గూగుల్‌ సెర్చ్‌, గూగుల్‌ అసిస్టెంట్‌, గూగుల్‌ మ్యాప్స్‌, లెజెండరీ స్నేక్‌ గేమ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కానీ అప్పడు వాట్సాప్‌ సపోర్టును ఈ బనానా ఫోన్‌ అందించలేకపోయింది. తాజాగా జియో తన ఫీచర్‌ ఫోన్‌కు వాట్సాప్‌ సపోర్టు తేవడంతో, ఇది కూడా తమ నోకియా ఫోన్‌కు త్వరలోనే వాట్సాప్‌ అందివ్వనున్నట్టు సంకేతాలిచ్చింది. ‘చూడండి. కిఓఎస్‌లో వాట్సాప్‌. ‘బనానా’స్‌లోకి వెళ్లడానికి చూస్తోంది’ అని హెచ్‌ఎండీ గ్లోబల్‌ చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌ జుహో సర్వికాస్‌ ట్వీట్‌ చేశారు. దీంతో త్వరలోనే నోకియా 8110  4జీ లోకి వాట్సాప్‌ వస్తున్నట్టు తెలిసింది. 

నోకియా 8110  4జీ ఫీచర్లు...
డ్యూయల్‌ సిమ్‌
కిఓఎస్‌ ఆధారిత స్మార్ట్‌ ఫీచర్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌
2.45 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే
1.1గిగాహెడ్జ్‌ డ్యూయల్‌-కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 205 ప్రాసెసర్‌
512 ఎంబీ ర్యామ్‌
4జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
మైక్రోఎస్డీ కార్డు ద్వారా మరింత విస్తరణ
2 ఎంపీ రియర్‌ కెమెరా
1500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top