జియో యూజర్లకు మరో ఆఫర్‌  | Jio users rejoice as Reliance Jio finally makes Jio TV available on web | Sakshi
Sakshi News home page

జియో యూజర్లకు మరో ఆఫర్‌ 

Dec 18 2017 3:20 PM | Updated on Dec 18 2017 7:14 PM

Jio users rejoice as Reliance Jio finally makes Jio TV available on web - Sakshi

టెలికాం మార్కెట్‌లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్‌ జియో తన యూజర్లకు మరో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. జియో టీవీ యాప్‌ను ఇక నుంచి వెబ్‌సైట్‌పై అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో వెబ్‌సైట్‌లపైనే ఛానల్స్‌ను వీక్షించే సౌకర్యం కల్పించింది. జియో సబ్‌స్క్రైబర్ల నుంచి భారీ ఎత్తున్న వెల్లువెత్తిన డిమాండ్‌లలో ఇదీ ఒకటి. మొబైల్‌లో ఉన్న జియో టీవీ యాప్‌ ద్వారా మాత్రమే ఛానల్స్‌ను జియో సబ్‌స్క్రైబర్లు యాక్సస్‌ చేసుకోవచ్చు. జియో టీవీ ద్వారా 60 హెచ్‌డీ ఛానల్స్‌తో పాటు 400 ఛానల్స్‌ను బ్రౌజర్‌పై యాక్సస్‌ చేసుకునే అవకాశం వినియోగదారులకు ఉంది. జియో టీవీ వల్ల యూజర్లకు కలిగే అతిపెద్ద ప్రయోజనం, ఏదైనా పని ఉన్నప్పుడు టీవీ షోను పాస్‌ చేసి, అవసరమైనప్పుడు టీవీ ఛానల్స్‌ను చూడవచ్చు. గత ఏడు రోజులుగా మిస్‌ అయిన టీవీ షోలను కూడా వీక్షించేందుకు జియో టీవీ యాక్సస్‌ కల్పించనుంది.

వెబ్‌సైట్‌పై జియో టీవీ అందుబాటులో అంటే.. జియో సబ్‌స్క్రైబర్లు వివిధ కేటగిరీ ఛానల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మూవీస్‌, కిడ్స్‌, స్పోర్ట్స్‌, లైఫ్‌స్టయిల్‌, ఇన్ఫోటైన్‌మెంట్‌, న్యూస్‌, మ్యూజిక్‌, రీజనల్‌, డివోషనల్‌, బిజినెస్‌ న్యూస్‌ వంటి వాటిని వెబ్‌సైట్‌పై కూడా చూడవచ్చు. హిందీ, మరాఠి, పంజాబి, ఉర్దూ, బెంగాళి, ఇంగ్లీష్‌, మలయాళం, తమిళ్‌, గుజరాతి, ఒడియా, తెలుగు, బోజ్‌పురి, కన్నడ, అస్సామి, నేపాలి, ఫ్రెంచ్‌ వంటి వివిధ భాష ఛానల్స్‌ను కూడా జియో టీవీ ఆఫర్‌ చేయనుంది. అయితే ల్యాప్‌టాప్‌లపై జియో టీవీ యాక్సస్‌, ఎక్స్‌క్లూజివ్‌గా జియో సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందించనుంది.  జియో అకౌంట్‌ లేని వారు, ఛానల్స్‌ను చూసేందుకు తమ ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లపై జియో లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement