4జీ స్పీడ్‌లో జియో టాప్‌.. | JIO top in 4G speed | Sakshi
Sakshi News home page

4జీ స్పీడ్‌లో జియో టాప్‌..

Feb 3 2018 12:57 AM | Updated on Feb 3 2018 12:57 AM

JIO  top in 4G speed - Sakshi

న్యూఢిల్లీ: రిలయన్స్‌ జియో జోరు కొనసాగుతూనే ఉంది. ఇది వరుసగా 11వ నెలలోనూ 4జీ స్పీడ్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. జియో డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 2017 నవంబర్‌లో 25.6 ఎంబీపీఎస్‌గా నమోదయ్యింది. టెలికం రెగ్యులేటర్‌ ట్రాయ్‌ తాజాగా ఈ విషయాలను వెల్లడించింది. వొడాఫోన్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 10 ఎంబీపీఎస్‌గా రికార్డయ్యింది.

ఇక వీటి తర్వాతి స్థానాల్లో భారతీ ఎయిర్‌టెల్‌ (9.8 ఎంబీపీఎస్‌), ఐడియా సెల్యులార్‌ (7 ఎంబీపీఎస్‌) ఉన్నాయి. జియో డౌన్‌లోడ్‌ స్పీడ్‌ అక్టోబర్‌లో 21.8 ఎంబీపీఎస్‌గా ఉంది. అప్‌లోడ్‌ స్పీడ్‌ విషయానికి వస్తే.. వొడాఫోన్‌ 6.9 ఎంబీపీఎస్‌తో టాప్‌లో నిలిచింది. దీని తర్వాతి స్థానంలో ఐడియా సెల్యులర్‌ (6.6 ఎంబీపీఎస్‌), జియో (4.9 ఎంబీపీఎస్‌), ఎయిర్‌టెల్‌ (4 ఎంబీపీఎస్‌) ఉన్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement