జియో మరో కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌

Jio Rs. 99 Recharge Launched Exclusively for Jio Phone Users - Sakshi

రిలయన్స్‌ జియో కంపెనీ తన జియోఫోన్‌ యూజర్ల కోసం ఎక్స్‌క్లూజివ్‌గా సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. 99 రూపాయలతో ఈ కొత్త జియోఫోన్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ను ఆవిష్కరిస్తున్నట్టు తెలిపింది. దీని కింద 28 రోజుల పాటు రోజుకు 500 ఎంబీ డేటాను కస్టమర్లకు జియో ఆఫర్‌ చేయనుంది. ప్రస్తుతమున్న 49 రూపాయల, 153 రూపాయల ప్యాక్‌లకు ఈ ప్లాన్‌ అదనం. ఈ ప్లాన్‌ను, కంపెనీ జియోఫోన్‌ మాన్‌సూన్‌ హంగామా ఎక్స్చేంజ్‌ ఆఫర్‌తో పాటు తీసకొచ్చింది. కొత్త రూ.99 జియోఫోన్‌ రీఛార్జ్‌, యూజర్లు నెలవారీ ఖర్చులను సుమారు 50 శాతం తగ్గించింది. డేటాతో పాటు ఎస్‌ఎంఎస్‌లను జియో 300కు పెంచింది. వాయిస్‌ కాల్స్‌ను ఉచితంగా అందించనున్నట్టు పేర్కొంది. 

అదేవిధంగా రూ.594 రీఛార్జ్‌ ప్యాక్‌ను కూడా జియో ఆఫర్‌ చేస్తోంది. దీని కింద ఆరు నెలల పాటు అపరిమిత డేటాను, అపరిమిత కాల్స్‌ను ఆఫర్‌ చేయనున్నట్టు తెలిపింది. అయితే ఈ ప్యాక్‌లో ఎలాంటి టెక్ట్స్‌ మెసేజ్‌లు రావడం లేదు. కాగ, జియో తీసుకొచ్చిన మాన్‌సూన్‌ హంగామా ఆఫర్‌ కింద, రూ.501 రీఫండబుల్‌ డిపాజిట్‌ కింద కొత్త జియోఫోన్‌ను తీసుకోవచ్చు. అయితే ఎక్స్చేంజ్‌ చేసే ఫీచర్‌ ఫోన్‌, వర్కింగ్‌ కండీషన్‌లో ఉండి, మూడేళ్ల కంటే తక్కువ వాడినదై ఉండాలి. ఈ హ్యాండ్‌సెట్‌ను ఎవరైతే పొందాలనుకుంటున్నారో, వారికి 101 రూపాయల విలువైన 6 జీబీ కాంప్లిమెంటరీ డేటాను జియో ఆఫర్‌ చేయనుంది. ఈ హ్యాండ్‌సెట్‌తో పాటు, కొత్త జియో సిమ్‌ కూడా కస్టమర్లకు వస్తుంది. అయితే పాత నెంబర్‌ను మొబైల్‌ పోర్టబులిటీ పెట్టుకోవాల్సి ఉంటుంది.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top