టెలికాం షేర్లకు జియో దెబ్బ

Jio Republic day offers: Airtel, Idea, Rcom shares down - Sakshi

సాక్షి, ముంబై: దలాల్‌ స్ట్రీట్‌లో కొత్త గరిష్టాల హోరు కొనసాగుతూనే ఉంది. తాజాగా నిఫ్టీ 11,100స్థాయిని కూడా దాటేసింది. ఆరంభంలో కన్సాలిడేషన్‌ బాట పట్టిన మార్కెట్లు లాభాలతో పుంజుకున్నాయి.  ఈ క్రమంలో నిష్టీ ఈ గరిష్టాన్ని తాకింది. అయితే తీవ్ర ఊగిసలాటలమధ్య మార్కెట్లు మళ్లీ ఫ్లాట్‌గా  మారాయి. మరోవైపు గురువారం డెరివేటివ్‌ కౌంటర్‌కు చివరి రోజు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తతగా వ్యవహరిస్తున్నట్టు ఎనలిస్టులు పేర్కొంటున్నారు.  మెటల్‌, ఆటో, నష్టపోతుండగా, బ్యాంక్స్‌ ,ఐటీ లాభాల్లో కొనసాగుతున్నాయి.  దీంతో నిఫ్టీ బ్యాంకు కొత్త గరిష్టాన్ని తాకింది.  కానీ  ప్రాఫింట్‌బుకింగ్‌ కారణంగా నష్టాల్లోకి మళ్లింది.  టీసీఎస్‌ షేరు కూడా ఆల్‌ టైం ని తాకింది.
మరోవైపు రిలయన్స్‌ జియో ప్రకటించిన రిపబ్లిక్‌ డే ఆఫర్లదెబ్బతో  టెలికాం దిగ్గజాల షేర్లు భారీగా నష్టపోతున్నాయి. భారతి ఎయిర్‌టెల్‌ 4 శాతం క్షీణించి,   ఐడియా  5 శాతం పతనమై టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.  వీటితోపాటు ఆర్‌కాం కూడా  2శాతం నష్టాలతో కొనసాగుతోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top