ఉద్యోగుల కోసం జియో అవగాహన కార్యక్రమాలు | Jio Awareness Programmes On Safety Precautions | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల భద్రతకు జియో అవగాహన కార్యక్రమాలు

Mar 6 2020 10:12 PM | Updated on Mar 6 2020 10:49 PM

Jio Awareness Programmes On Safety Precautions - Sakshi

సాక్షి, హైదరాబాద్ : 49వ జాతీయ భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకొని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని తమ సంస్థ  కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. తమ సంస్థ ఉద్యోగులు, కాంట్రాక్టర్ల భాగస్వామ్యంతో 2020 మార్చి 4 నుంచి 10 వరకు వారం రోజులపాటు జియో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించ తలపెట్టింది. ఏడాదిపాటు నిబద్ధత, క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవనవిధానంతో ఉద్యోగులు పని చేయడానికి దోహదపడేలా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జాతీయ భద్రతా ఉత్సవాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని వర్క్ సైట్లలో భద్రతా అవగాహన కార్యకలాపాలకు సంబంధించిన పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నిర్మాణ సామాగ్రిని, యంత్రాలను, సామాగ్రి పట్ల సురక్షితంగా వ్యవహరించడంపై ప్రత్యేక ప్రదర్శనతోపాటు, మాక్‌ డ్రిల్‌ శిక్షణ ఏర్పాటు చేశారు.  

ఈ సందర్భంగా భద్రత అవగాహనపై పలువురు సంస్థ ఉన్నతాధికారులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భద్రతను నిరంతరం గుర్తు చేసే బ్యాడ్జీలు ధరించి, బ్యానర్‌, పోస్టర్లను ప్రదర్శించారు. అదేవిధంగా జెండాను అవిష్కరించి ప్రతిజ్ఞ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement