పన్ను ఎగవేతలపై బహుళపక్ష ఒప్పందం | Jaitley embarks on 4-day visit to Paris, to sign OECD tax pact | Sakshi
Sakshi News home page

పన్ను ఎగవేతలపై బహుళపక్ష ఒప్పందం

Jun 9 2017 12:17 AM | Updated on Sep 5 2017 1:07 PM

పన్ను ఎగవేతలపై బహుళపక్ష ఒప్పందం

పన్ను ఎగవేతలపై బహుళపక్ష ఒప్పందం

చట్టాల్లో లొసుగులు ఉపయోగించుకుని పన్నులు ఎగవేసే సంస్థలకు చెక్‌ చెప్పే దిశగా భారత్‌తో పాటు 67 దేశాలు చేతులు కలిపాయి.

పారిస్‌లో సంతకాలు చేసిన ఆర్థిక మంత్రి జైట్లీ
పారిస్‌/న్యూఢిల్లీ: చట్టాల్లో లొసుగులు ఉపయోగించుకుని పన్నులు ఎగవేసే సంస్థలకు చెక్‌ చెప్పే దిశగా భారత్‌తో పాటు 67 దేశాలు చేతులు కలిపాయి. ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) సమావేశంలో ఇందుకు సంబంధించిన బహుళపక్ష ఒప్పందంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సంతకం చేశారు. దీంతో వివిధ దేశాలు కుదుర్చుకున్న 1,100 పైగా పన్ను ఒప్పంద నిబంధనల్లో తగు మార్పులు, చేర్పులు జరగనున్నాయి. ద్వంద్వ పన్నుల నివారణ కోసం భారత్‌కు ప్రస్తుతం సైప్రస్, మారిషస్, సింగపూర్‌ తదితర దేశాలతో ఒప్పందాలు(డీటీఏఏ) ఉన్నాయి.

వీటిని ఊతంగా తీసుకుని పలు బహుళజాతి సంస్థలు పన్నుప్రయోజనాలు అత్యధికంగా ఉండే దేశాలకు ప్రధాన కార్యాలయాలను మళ్లించి, ఇతర దేశాల్లో ఆర్జించే లాభాలపై పన్నులను ఎగవేస్తున్నాయి. ఇది గుర్తించిన భారత్‌ ఇటీవలే కొన్ని దేశాలతో డీటీఏఏ ఒప్పందాలను సవరించింది. ప్రధాన కార్యాలయమున్న దేశంలో కాకుండా కార్పొరేట్లు ఆదాయం ఆర్జించే దేశాల్లోనే పన్నులు కట్టే విధంగా మార్పులు చేసింది.    

Advertisement
 
Advertisement
Advertisement