రూ.1299లకే స్మార్ట్‌ఫోన్‌ | iVoomi V5 has been launched in India | Sakshi
Sakshi News home page

రూ.1299లకే స్మార్ట్‌ఫోన్‌

Jun 7 2018 3:43 PM | Updated on Jun 7 2018 4:42 PM

iVoomi V5 has been launched in India - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ  హాంగ్‌కాంగ్‌కు చెందిన ఐ వూమి కంపెనీ మరో బడ్జెట్‌ఫోన్‌ను లాంచ్‌ ​ చేసింది. ఎంట్రీ లెవల్‌ సెగ్మెంట్‌లో ఐవూమి వి5 పేరుతో  కొత్త స్మార్ట్‌ఫోన్నుభారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. జెడ్ బ్లాక్, షాంపైన్ గోల్డ్  రంగుల్లో రూ.3499 ధరకు కొనుగోలుకు అందుబాటులో ఉంచింది. దీంతోపాటు యాక్సిస్ బ్యాంక్,  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్  క్రెడిట్,  డెబిట్ కార్డ్‌ ద్వారా కొనుగోల చేస్తే  తక్షణం 10 శాతం తగ్గింపు పొందవచ్చు. అలాగే  జియో  ద్వారా  జియో ఫుట్‌ బాల్‌ ఆఫర్‌ కింద 2200 రూపాయల క్యాష్‌బ్యాక్‌​ ఆఫర్‌ కూడా ఉంది. అంటే జియో ఆఫర్‌ తరువాత   1299 రూపాయలకే ఐ వూమి వి5 స్మార్ట్‌ఫోన్‌ కస్టమర్ల సొంతం కానుంది. 

సరసమైన ధరలో ఆధునిక టెక్నాలజీ, ఫీచర్లతో ఎంట్రీ లెవల్‌​ డివైస్‌ను  వినియోగదారులకు అందిస్తున్నామని ఐవూమి సీఈఓ అశ్విన​ భండారి చెప్పారు.  ముఖ్యంగా పగుళ్లు, గీతలు నుంచి స్ర్రీన్‌కు మరింత భద్రతనిచ్చేలా షట్టర్‌  ప్రూష్‌  డిస్‌ప్లేని ఈ స్మార్ట్‌ఫోన్‌లో అందిస్తున్నామన్నారు

ఐవూమి వి5 ఫీచర్లు
5 అంగుళాల డిస్‌ప్లే 
480x854 రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 7.0 నౌగాట్ 
 క్వాడ్-కోర్ స్ప్రెడ్ట్రమ్ ఎస్‌వోసీ 
1 జీబీ ర్యామ్‌, 8జీబీ స్టోరేజ్‌
128 వరకు విస్తరించుకునే అవకాశం
5 మెగాపిక్సెల్ రియర్‌
5 మెగాపిక్సెల్  సెల్ఫీ కెమెరా 
2800 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement