ఆర్థిక సంవత్సరం మార్పుపై సలహాలకు ఆహ్వానం

ఆర్థిక సంవత్సరం మార్పుపై సలహాలకు ఆహ్వానం


న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, దేశంలోని పలు కంపెనీలు ప్రస్తుతం తమ ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ 1-మార్చి 31గా పాటిస్తున్నాయి. అయితే బడ్జెటరీ ప్రక్రియ మెరుగుకు, తగిన నగదు నిర్వహణకు  ఈ కాలం మార్పు అవసరమని పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో దీనిపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా సంబంధిత వర్గాల నుంచి సలహాలనూ, సూచనలను ఆహ్వానించింది. ఇందుకు సెప్టెంబర్ 30 వరకూ గడువు పెట్టింది.


ఇప్పటికే ఈ అంశంపై మాజీ  ప్రధాన ఆర్థిక సలహాదారు శంకర అచార్య నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ డిసెంబర్ చివరినాటికి తన నివేదికను సమర్పించే వీలుంది.  1985లో ఎల్‌కే ఝా కమిటీ ఈ అంశంపై సమీక్ష జరిపి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకూ ప్రభుత్వాలు ఆర్థిక సంవత్సరాన్ని పాటించాలని ఈ కమిటీ చేసిన సిఫారసును అప్పటి ప్రభుత్వం అంగీకరించలేదు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top