కరోనా : ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్

Instagram makes live streams viewable on the desktop - Sakshi

వెబ్‌ బ్రౌజర్  ద్వారా   బిగ్ స్క్రీన్ పై లైవ్ వీడియోలు

సాక్షి,న్యూఢిల్లీ:  ఫేస్‌బుక్ యాజమాన్యంలోని ఫోటో,  వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసం కొత్త ఫీచర్ ను అందుబాటులో తీసుకొచ్చింది.   కరోనా వ్యాప్తి,  లాక్ డౌన్ ఆంక్షలతో ఇంటికి పరిమితమైన తన వినియోగదారులు  వెబ్‌ బ్రౌజర్  ద్వారా బిగ్ స్కీన్ (డెస్క్ టాప్),  పై వీడియోలను  వీక్షించే అవకాశాన్ని కల్పించింది. లైవ్ వీడియోల చూస్తుండగానే , కింద వున్న విండో ద్వారా వ్యాఖ్యలను స్క్రోల్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు ఇప్పుడు పెద్ద స్క్రీన్ డివైస్ లలో ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించ వచ్చని తెలిపింది. అయితే యూజర్లు ఒకరి కంటే ఎక్కువ వ్యక్తులతో లైవ్ వీడియోలో వుండటం..ఒకరి కన్నా ఎక్కుమందితో ఒకేసారి చాట్ చేయడం కష్టమవుతుందని తెలిపింది. అలాగే, ల్యాప్‌టాప్ లో ఈ  ఫీచర్ అందుబాటులో ఉండదు కాబట్టి, ఐఫోన్, ఆండ్రాయిడ్ యాప్ ల ద్వారా మాత్రమే ఈ ఫీచర్  ఉపయోగించు కోవచ్చని ప్రకటించింది.

కరోనా వైరస్ సోకి ఐసోలేషన్ లో ఉన్న కరోనా పేషెంట్ల కోసమే ఒక ఫీచర్ ను ఇటీవల ప్రకటించింది. ఐసోలేషన్ వార్డులో ఉన్న రోగుల ఒంటరి భావనను పోగొట్టేందుకు  కో వాచింగ్ పేరుతో  కొత్త అవకాశాన్ని ఆవిష్కరించింది. దీని ద్వారా ఇంట్లో స్వీయ నిర్బంధంలో లేదా  ఐసోలేషన్ వార్డులో వున్న యూజర్లు  ఇతరులతో  కనెక్ట్ అయ్యేందుకు ఈ కో-ఫీచర్  తీసుకొచ్చింది. ఇందులో యూజర్లు ఒకవైపు తమ పోస్టులను స్ర్కోల్ చేస్తూనే రిమోట్ మోడ్‌లో వీడియోలను వీక్షించవచ్చు. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లోని డైరెక్ట్ మెసేజ్ గ్రూపు చాట్ లోని పైన ఉన్న వీడియో గుర్తును క్లిక్  చేసి తమ స్నేహితుల పోస్టుల, స్టోరీలు లేదా ఇన్ స్టా లైవ్ లను ఒకేసారి వీక్షించవచ్చు. అలాగే ఇన్‌స్టాగ్రామ్ వెబ్ బ్రౌజర్ నుండి  డైరెక్టుగా సందేశాలను పంపుకునే అవకాశాన్ని  కూడా ప్రపంచవ్యాప్తంగా  తీసుకొచ్చిన  సంగతి తెలిసిందే.

 కాగా ఈ సంవత్సరం ప్రారంభంలో, ఇన్‌స్టాగ్రామ్ కరోనావైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని అనేక కొత్త నవీకరణలను ప్రకటించింది. వైరస్ పై అవగాహన,  ఖచ్చితమైన సమాచారాన్ని ప్రోత్సహించడానికి స్టిక్కర్లు, కోవిడ్ -19  తప్పుడు వార్తలను షేర్ చేసిన ఖాతాలను తొలగించడం, విరాళాలు, భౌతిక దూరాన్ని పాటించే వారు ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి సహాయపడేలా భాగస్వామ్య కథనాలను ఇవ్వడం, స్టేహోమ్ స్టిక్కర్‌ను ఉపయెగించుకుని, వీడియో చాట్ ద్వారా స్నేహితులతో చాటింగ్  అవకాశాలను అందుబాటులోకి తెచ్చింది.  

   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top