breaking news
live videos
-
మైనేమ్ ఈజ్ సుజి, ఐ యామ్ సింగిల్.. అంటూ వీడియో కాల్ చేసి.. దుస్తులు తీసేసి..
సాక్షి, నిర్మల్: ‘హాయ్..మైనేమ్ ఈజ్ సుజి(పేరు మార్చాం). వాట్ ఈజ్ యువర్ నేమ్. వేర్ ఆర్ యు ఫ్రమ్. ఐ యామ్ సింగిల్...’ అంటూ ప్రవీణ్(పేరు మార్చాం) అనే యువకుడి మెసెంజర్లో ఒక మెసెజ్ వచ్చింది. పేరు కొత్తగా ఉండటంతో పాటు అందమైన అమ్మా యి ఫొటో డీపీగా ఉండటంతో మెసెంజర్ ఓపెన్‌చేసి, తాను కూడా చాట్ చేయడం మొదలు పెట్టాడు. కాసే పటికే ఎదుటి యువతి ఫోన్ నంబర్ చెప్పు, వీడియో కాల్ చేస్తాను అనటంతోనే.. ఏమాత్రం ఆలోచించకుండా ప్రవీణ్ వెంటనే తన నంబర్‌ను పంపించాడు. సెకన్ల వ్యవధిలోనే గుర్తుతెలియని ఓ కొత్త నంబర్ నుంచి ఆయనకు వాట్సప్ ద్వారా వీడియోకాల్ వచ్చింది. లిఫ్ట్ చేసేసరికి.. నిజంగానే ఓ అందమైన యువతి లైన్లోకి వచ్చింది. ‘హాయ్..’ అంటూ స్వీట్‌గా ఇంగ్లిష్‌లో మాట్లాడటం మొదలుపెట్టింది. అతడూ వచ్చీరాని ఇంగ్లిష్తో మాట్లాడాడు. కాసేపటికే ఆమె అసభ్యకరంగా మాట్లాడటం, దుస్తులు తొలగించడం చేసింది. తనను కూడా అలాగే చేయాలని చెప్పడంతో.. వెనుకాముందు ఆలోచించకుండా తీసేశాడు. కాసేపటికే.. వీడియోకాల్ కట్ అయ్యింది. అంతే.. ప్రవీణ్ దుస్తులు సర్దుకునేంత లోపే వాట్సప్‌లో ఒక వీడియోతోపాటు ఒకదాని వెంట ఒకటి మెసేజ్‌లు రావడం మొదలయ్యాయి. వాటిని చూడటంతోనే ప్రవీ ణ్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. అప్పటి దాకా వారు మాట్లాడుకున్న వీడియోకాల్ మొత్తం రికార్డు చేసి, తనకు పంపించారు. ‘దుస్తులు లేకుండా మనం ఇద్దరం మాట్లాడుకున్న వీడియో మొత్తం రికార్డు అయ్యింది. నువ్వు వెంటనే మా గూగుల్‌పే నంబర్‌కు రూ.50 వేలు పంపించు. చదవండి: ఇప్పుడే వస్తానమ్మా... అంటివి కదా కొడుకా! లేదంటే ఈ వీడియో మీ ఫ్రెండ్స్, మీ కుటుంబ సభ్యులందరికీ పంపిస్తాను. సోషల్ మీడియాలలో పోస్టు చేస్తాను. వెంటనే డబ్బు పంపించు.. లేదంటే.. అంతే సంగతి..’అంటూ వరుసగా మెసెజ్‌లు వచ్చాయి. దీంతో ప్రవీణ్ ఒక్కసారిగా బెదిరిపోయాడు. ఏం చేయాలో.. ఎవరికి చెప్పుకోవాలో.. తెలియక కంగారుతో జ్వరం తెచ్చుకున్నాడు. చివరికి దగ్గరి మిత్రుడి సలహాతో వారి ఫోన్లు లిఫ్డ్ చేయడం, మెసేజ్‌లు చూడటం చేయడం లేదు. రెండు రోజులైనా ఇంకా ఆ ఘటన నుంచి తేరుకోవడం లేదు. ఒక్క ప్రవీణ్‌కే కాదు.. జిల్లాలో చాలామంది ‘హనీట్రాప్’కు గురవుతున్నారు. ఇలాంటి పలు రకాల సైబర్ ఉచ్చులతో పలు ముఠాలు వివిధ వయసుల వారిని టార్గెట్ చేస్తున్నాయి. మాటలతో మాయచేస్తూ మోసాలకు పాల్పడుతున్నాయి. చదవండి: ఐటీ కంపెనీలపై ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఇంకొంత కాలం ఇంటి నుంచే! మాట కలిపి..మాయ చేస్తూ ‘హనీట్రాప్’.. ఇటీవల ఈ ఉచ్చు బిగించేవారి సంఖ్య పెరుగుతోంది. అందమైన యువతులను ముందు ఉంచి కొన్ని సైబర్ దోపిడీ ముఠాలు ఉచ్చులు పన్నుతున్నాయి. సదరు యువతులు ముందు స్వీట్‌గా పలకరిస్తూ.. మాటల్లోకి దించుతున్నారు. తమ దుస్తులను తొలగిస్తూ.. మెల్లగా ఉచ్చులోకి దించి, ఎదుటి వ్యక్తిని కూడా అసభ్యకరంగా తయారయ్యే దాకా వేచి చూస్తున్నారు. ఇదంతా స్పైవేర్‌తో రికార్డు చేసి, ఆ తర్వాత బెదిరింపులకు దిగుతున్నారు. సదరు అమ్మాయిని ముందుండి కథ నడించిన ముఠా రంగంలోకి దిగి, డబ్బులు డిమాండ్ చేస్తోంది. లేదంటే నీ వీడియో మొత్తం యూట్యూబ్, సోషల్ మీడియాల ద్వారా అందరికీ పంపిస్తామంటూ బెదిరిస్తోంది. చదవండి: అంబులెన్స్ లేదు.. పీహెచ్‌సీకి తాళం.. ఆటోలోనే ప్రసవించిన మహిళ యువతే లక్ష్యంగా... ప్రధానంగా యువతనే లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ముఠాలు సైబర్‌నేరాలకు పాల్పడుతున్నాయి. ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న ఘటనలను పరిశీలిస్తే.. బాధితులంతా 25 నుంచి 28ఏళ్లలోపు వారే ఉన్నారు. ఇందులో పెళ్లికాని వాళ్లు, పెళ్లికి దగ్గరి వయసులో ఉన్నవారినే సదరు ముఠాలు టార్గెట్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇలాంటి వారైతేనే.. పెళ్లి కావాల్సిన వయసులో ఇలాంటి వీడియోలు బయటకు వస్తే తన పరువు పోవడంతోపాటు పెళ్లికి ఇబ్బంది అవుతుందన్న భయంతో ఎంత అడిగితే అంత డబ్బు ఇస్తారన్న ఉద్దేశంతో ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. కొంతమంది పెళ్లయిన వారు కూడా ఎక్కడ తమ బండారం భార్య కు తెలుస్తుందోనన్న భయంతో సదరు ముఠాలకు ఎంత అడిగితే అంత ముట్టజెప్పిన ఘటనలూ ఉన్నాయి. సోషల్‌మీడియా ద్వారా.. సైబర్ నేరాలకు పాల్పడుతున్న చాలా ముఠాలు సోషల్ మీడియా నుంచే తమ టార్గెట్లను ఎంచుకుంటున్నాయి. ప్రధానంగా ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగాంలలో పూర్తి ప్రొఫైల్‌ను పెట్టడం, ఫ్రెండ్స్ గురించి ఉండటంతో సదరు వ్యక్తి ఎలాంటివాడు, ఆయన వెనుకాముందు ఏముందనేది మొత్తం తెలిసిపోతోంది. వారిలో తమ పనికి సులువుగా దొరికి పోయేవాడు, డబ్బులు పంపించేవాడిని ఎంచుకుంటున్నారు. ముందు మెసెజ్‌లతో బెదిరిస్తున్నారు. లేనిపక్షంలో నేరుగా కాల్ చేసి భయపెట్టిస్తున్నారు. పోలీసులకు ఫోన్‌చేసినా, స్టేషన్‌కు వెళ్లినా వెంటనే మీవాళ్లకు ఈ వీడియోలు షేర్ చేస్తామని హెచ్చరిస్తుండటంతో చాలామంది గుట్టుగా ఎంతోకొంత డబ్బులు ముట్ట జెప్పుతున్నట్లు తెలుస్తోంది. కానీ.. ఇలాంటి ముఠాలు ఒకసారి డబ్బు తీసుకోవడంతోనే వదిలిపెట్టవని, తరచూ అడుగుతూనే ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఘటన ఏది జరిగినా వెంటనే స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. -
కరోనా : ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్
సాక్షి,న్యూఢిల్లీ: ఫేస్బుక్ యాజమాన్యంలోని ఫోటో, వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్ యూజర్ల కోసం కొత్త ఫీచర్ ను అందుబాటులో తీసుకొచ్చింది. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ ఆంక్షలతో ఇంటికి పరిమితమైన తన వినియోగదారులు వెబ్ బ్రౌజర్ ద్వారా బిగ్ స్కీన్ (డెస్క్ టాప్), పై వీడియోలను వీక్షించే అవకాశాన్ని కల్పించింది. లైవ్ వీడియోల చూస్తుండగానే , కింద వున్న విండో ద్వారా వ్యాఖ్యలను స్క్రోల్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు ఇప్పుడు పెద్ద స్క్రీన్ డివైస్ లలో ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించ వచ్చని తెలిపింది. అయితే యూజర్లు ఒకరి కంటే ఎక్కువ వ్యక్తులతో లైవ్ వీడియోలో వుండటం..ఒకరి కన్నా ఎక్కుమందితో ఒకేసారి చాట్ చేయడం కష్టమవుతుందని తెలిపింది. అలాగే, ల్యాప్‌టాప్ లో ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు కాబట్టి, ఐఫోన్, ఆండ్రాయిడ్ యాప్ ల ద్వారా మాత్రమే ఈ ఫీచర్ ఉపయోగించు కోవచ్చని ప్రకటించింది. కరోనా వైరస్ సోకి ఐసోలేషన్ లో ఉన్న కరోనా పేషెంట్ల కోసమే ఒక ఫీచర్ ను ఇటీవల ప్రకటించింది. ఐసోలేషన్ వార్డులో ఉన్న రోగుల ఒంటరి భావనను పోగొట్టేందుకు కో వాచింగ్ పేరుతో కొత్త అవకాశాన్ని ఆవిష్కరించింది. దీని ద్వారా ఇంట్లో స్వీయ నిర్బంధంలో లేదా ఐసోలేషన్ వార్డులో వున్న యూజర్లు ఇతరులతో కనెక్ట్ అయ్యేందుకు ఈ కో-ఫీచర్ తీసుకొచ్చింది. ఇందులో యూజర్లు ఒకవైపు తమ పోస్టులను స్ర్కోల్ చేస్తూనే రిమోట్ మోడ్‌లో వీడియోలను వీక్షించవచ్చు. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లోని డైరెక్ట్ మెసేజ్ గ్రూపు చాట్ లోని పైన ఉన్న వీడియో గుర్తును క్లిక్ చేసి తమ స్నేహితుల పోస్టుల, స్టోరీలు లేదా ఇన్ స్టా లైవ్ లను ఒకేసారి వీక్షించవచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్ వెబ్ బ్రౌజర్ నుండి డైరెక్టుగా సందేశాలను పంపుకునే అవకాశాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ సంవత్సరం ప్రారంభంలో, ఇన్స్టాగ్రామ్ కరోనావైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని అనేక కొత్త నవీకరణలను ప్రకటించింది. వైరస్ పై అవగాహన, ఖచ్చితమైన సమాచారాన్ని ప్రోత్సహించడానికి స్టిక్కర్లు, కోవిడ్ -19 తప్పుడు వార్తలను షేర్ చేసిన ఖాతాలను తొలగించడం, విరాళాలు, భౌతిక దూరాన్ని పాటించే వారు ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి సహాయపడేలా భాగస్వామ్య కథనాలను ఇవ్వడం, స్టేహోమ్ స్టిక్కర్‌ను ఉపయెగించుకుని, వీడియో చాట్ ద్వారా స్నేహితులతో చాటింగ్ అవకాశాలను అందుబాటులోకి తెచ్చింది. -
ఇకపై యూట్యూబ్ పెయిడ్ చానెల్స్
శాన్ఫ్రాన్సిస్కో: యూట్యూబ్‌లో ఇకపై పెయిడ్ చానెల్ సభ్యత్వం అందుబాటులోకి రానుంది. తద్వారా సృజనాత్మకత కలిగిన వారు మరింత డబ్బు సంపాదించుకునే వీలు కలుగుతుందని యూట్యూబ్ అధికారి నీల్ మోహన్ పేర్కొన్నారు. పెయిడ్ చానెల్‌కు సబ్స్క్రైబర్స్ నెలకు దాదాపు రూ.340 (4.99 డాలర్లు) చెల్లిస్తే, ఆ చానెల్లోని కొన్ని ప్రత్యేకమైన వీడియోలు, లైవ్ వీడియోలు తదితరాలను చూసే వీలు కల్పిస్తామని వివరించారు. ఇది లక్షకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్న చానెళ్లకే వర్తిస్తుంది. -
ఫేస్బుక్ పబ్లిషర్లకు గుడ్ న్యూస్
న్యూయార్క్ : ఫేస్ బుక్ లో పోస్టు చేస్తున్న వీడియోల ద్వారా తగినంత మనీని సంపాదించలేని పబ్లిషర్లకు గుడ్ న్యూస్. టీవీ చూసేటప్పుడు మధ్యలో వచ్చే యాడ్స్ మాదిరి ఇక ఈ వ్యాపార ప్రకటనలు ఫేస్బుక్ లైవ్ వీడియోలోకి కూడా రాబోతున్నాయి. లైవ్ వీడియోస్ మధ్యలో 20 సెకన్ల యాడ్స్‌ను వేయాలని ఫేస్ బుక్ నిర్ణయించిందట. తన నెట్‌వర్క్‌పై షేర్ చేసే వీడియోస్ ద్వారా మనీ ఆర్జించాలని సోషల్ మీడియా దిగ్గజం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇలా ఆర్జించిన రెవెన్యూలను పబ్లిషర్లకు పంచబోతున్నట్టు ఫేస్ బుక్ పేర్కొంది. రీకోడ్ రిపోర్టు ప్రకారం పబ్లిషర్స్ వీడియోల మధ్యలో యాడ్స్‌ను వేయడం కంపెనీ త్వరలోనే ప్రారంభించబోతుందని తెలుస్తోంది. అచ్చం టీవీ కమర్షియల్ యాడ్స్ మాదిరే ఈ యాడ్స్ కూడా ఉండబోతున్నాయని తెలిపింది. యాడ్స్ ద్వారా ఆర్జించిన రెవెన్యూలను పబ్లిషర్లు, తను పంచుకోవాలనుకుంటోందని పేర్కొంది. ఫేస్బుక్లో వీడియోలు షేర్ చేస్తూ మనీని ఆర్జించలేని వారికి ఇది ఓ గుడ్ న్యూస్ లాంటిదని రీకోడ్ రిపోర్టు చేసింది. మధ్యలో వచ్చే 20 సెకండ్ల యాడ్ పూర్తిగా అయిపోయేంత వరకు లైవ్ స్ట్రీమ్ చేయడం కుదరదని రీకోడ్ రిపోర్టు పేర్కొంది. యాడ్ బ్రేక్‌కు ముందు పబ్లిషర్లు కనీసం నాలుగు నిమిషాలు లైవ్ స్ట్రీమ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత బ్రేక్, మళ్లీ లైవ్ ప్రొగ్రామ్ రన్ అయ్యేలా టెస్టింగ్ ప్రారంభించామని కంపెనీ అధికార ప్రతినిధి చెబుతున్నారు.