ఒక్క గంటలో 50 వేల కోట్ల రూపాయలు

Infosys shareholders gain Rs 50000 crore in an hour as shares zoom to new high - Sakshi

సాక్షి, ముంబై: కరోనా వైరస్  సంక్షోభంలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలను ప్రకటించింది. దీనికి తోడు గత త్రైమాసికంలో 1.65 బిలియన్ డాలర్లతో పోలిస్తే 1.74 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలను దక్కించుకుంది. దీంతో గురువారం నాటి మార్కెట్‌లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. ఫలితంగా ఇన్ఫోసిస్‌ షేరు రికార్డు లాభాల్లో  దూసుకుపోతోంది.  ఆరంభంలోనే 15 శాతం పైగా లాభపడి ఆల్‌ టైం గరిష్టాన్ని నమోదు చేసింది. దీంతో ఇన్ఫోసిస్ వాటాదారులు  కేవలం ఒక గంటలో 50 వేల కోట్ల రూపాయలను దక్కించుకోవడం  విశేషం.

ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ అంచనాలను  ఇన్పీ అధిగమించింది. జూన్‌ 30తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌  11.5 శాతం వృద్ధితో  4233 కోట్లు నికర లాభాలను సాధించింది. గత ఏడాది ఇదే సమయంలో ఇది  3798 కోట్లు రూపాయలుగా ఉంది. కంపెనీ కన్సాలిడేటెడ్‌ ఆదాయం 8.5 శాతం వృద్ధి చెంది  23,665 కోట్ల  రూపాయలకు చేరింది. గత ఏడాది ఇదే సమయంలో 21,803 కోట్ల రూపాయలుగా నమోదైంది.  అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ క్షీణించడం వల్ల సంస్థ లాభపడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో దేశీయ బ్రోకరేజ్ ఎడెల్విస్ ఇన్ఫోసిస్‌పై టార్గెట్ ధరను అప్‌గ్రేడ్ చేసింది.ఆదాయ మార్గదర్శక వృద్ధిని పునరుద్ఘాటించడం ముఖ్య సానుకూలతనీ, డిజిటల్‌ కార్యకలాపాలు పుంజుకోవడం కూడా సంస్థకు  సానుకూలమైన అంశమని వ్యాఖ్యానించింది.  (వ్యాగన్‌ ‌ఆర్‌, బాలెనో కార్లు రీకాల్‌)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top