డిసెంబర్‌లో తీపికబురు | Inflation may ease by December: C Rangarajan  | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌లో తీపికబురు

Nov 16 2017 4:51 PM | Updated on Nov 16 2017 4:51 PM

Inflation may ease by December: C Rangarajan  - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ధరల భారంతో ఉక్కిరిబిక్కిరవుతున్న సగటు భారతీయుడికి మాజీ ఆర్‌బీఐ గవర్నర్‌ రంగరాజన్‌ తీపికబురు చెప్పారు. ధరాఘాతం నుంచి డిసెంబర్‌లో ఉపశమనం లభించవచ్చని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతం నాటికి ద్రవ్యోల్బణం నాలుగు శాతం దిగువకు రావచ్చని ఆయన అంచనా వేశారు. ఆహార వస్తువులకు సంబంధించి డిసెంబర్‌ వరకూ ధరల పెరుగుదల కొనసాగినా ఆ తర్వాత ద్రవ్బోల్బణం దిగివస్తుందని చెప్పారు. ఈ ఏడాది రుతుపవనాలు మెరుగ్గా ఉండటంతో ఆహారోత్పత్తుల ధరలు పెరిగే అవకాశం లేదని, అవి మరింత దిగివస్తాయని పేర్కొన్నారు.

మరోవైపు ద్రవ్యోల్బణం అదుపులో ఉంటే ఆర్‌బీఐ వడ్డీరేట్లను తగ్గించవచ్చని భావిస్తున్నారు. అదే జరిగితే వాహన, గృహ, వ్యక్తిగత రుణాల వినియోగదారుల నెలవాయిదాలు(ఈఏంఐ) కొంతమేర దిగివస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement