రికార్డు స్థాయిలో దేశంలో విదేశీ కరెన్సీ | India's Foreign Exchange Reserves Are At An All Time High | Sakshi
Sakshi News home page

రికార్డు స్థాయిలో దేశంలో విదేశీ కరెన్సీ

Jun 18 2020 6:48 PM | Updated on Jun 18 2020 6:50 PM

India's Foreign Exchange Reserves Are At An All Time High - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతకమైన కరోనా మహమ్మారి చేతిలో చిక్కుకుని భారత ఆర్థిక వ్యవస్థ ఓ పక్క విలవిలలాడుతుంటే దేశంలో విదేశీ మారక ద్రవ్యం నిల్వలు మాత్రం మున్నెన్నడు లేని విధంగా అనూహ్యంగా పెరగుతున్నాయి. విదేశీ ద్రవ్యం నిల్వలు రికార్డు స్థాయిలో 37.92 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ జూన్‌ 12వ తేదీన విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొంది. ఆర్థిక మాంద్యం పరిస్థితులు భయపెడుతున్నప్పటికీ విదేశీ ద్రవ్యం విలువలు పెరగడం విశేషం.విదేశాల నుంచి నేరుగా వచ్చే దిగుమతులు తగ్గిపోవడం, విదేశాల నుంచి నేరుగా వచ్చే పెట్టుబడులు పెరగడం వల్ల విదేశీ ద్రవ్యం పెరిగిందని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ వివరించింది. (రిలయన్స్‌ @ రూ.11లక్షల కోట్లు)

ఈ ఏడాది మొదట్లోనే అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర భారీగా తగ్గడం కలిసొచ్చింది. గత ఏప్రిల్‌ నెలలో బారెల్‌ క్రూడాయిల్‌ ధర గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా తగ్గిందని మొదటిసారని ఆర్‌బీఊ వర్గాలు చెబుతున్నాయి. ఈ సారి చమురు దిగుమతులపై 5900 కోట్ల డాలర్లు మిగులుతాయని ముంబై కేంద్రంగా పని చేస్తోన్న మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ అంచనా వేసింది.  దేశంలోని ఒక్క రిలయెన్సీ అంబానీయే తన జియో ఫ్లాట్‌ఫారమ్‌ను విక్రయించి దేశంలోకి లక్ష కోట్ల విదేశీ ద్రవ్య నిల్వలు వచ్చి పడ్డాయి. భారతీయ స్టాక్‌ ఎక్చేంజ్‌ల్లో గత మే మూడు వారాల్లోనే 9,089 కోట్ల రూపాయలను విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement