సిటీ గ్యాస్‌ బిడ్డింగ్‌లో  ఐవోసీ టాప్‌ 

Indian Oil Corporation tops bidders - Sakshi

న్యూఢిల్లీ: నగరాల్లో గృహాలకు పైపుల ద్వారా వంట గ్యాస్, వాహనాలకు సీఎన్‌జీ సరఫరా కోసం నిర్వహించిన పదో విడత లైసెన్సుల వేలంలో ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) అత్యధిక స్థాయిలో బిడ్లు దాఖలు చేసింది. అదానీ గ్రూప్, హిందుస్తాన్‌ పెట్రోలియం, ఇంద్రప్రస్థ గ్యాస్‌ మొదలైనవి ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. పెట్రోలియం, గ్యాస్‌ రంగ నియంత్రణ సంస్థ (పీఎన్‌జీఆర్‌బీ) వెల్లడించిన వివరాల ప్రకారం ఐవోసీ మొత్తం 35 నగరాల్లో సొంతంగా, అదానీ గ్యాస్‌ భాగస్వామ్యంతో మరో ఏడు నగరాల్లో లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకుంది.

అదానీ గ్యాస్‌ సొంతంగా 19 నగరాలకు, ఐవోసీ భాగస్వామ్యంతో ఏడు నగరాలకు బిడ్లు వేసింది. ప్రభుత్వ రంగ గెయిల్‌ గ్యాస్‌ ప్రాంతాలకు బిడ్స్‌ దాఖలు చేసింది. పదో విడతలో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు సహా మొత్తం 50 నగరాలకు బిడ్డింగ్‌ నిర్వహించారు. ఫిబ్రవరి 7–9 మధ్యలో బిడ్లు తెరిచారు. 14 రాష్ట్రాల్లో 124 జిల్లాలకు ఈ లైసెన్సుల ద్వారా సేవలు అందించవచ్చు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top