స్మార్ట్‌ఫోన్‌ పరికరాలపై మరింత బాదుడు

India Imposes 10 Percent Tax On Import Smartphone Components - Sakshi

న్యూఢిల్లీ : ప్రపంచంలో రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌గా ఉన్న భారత్‌, స్థానికతను మరింత పెంచాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో దిగుమతి చేసుకుంటున్న కీలక స్మార్ట్‌ఫోన్‌ పరికరాలపై 10 శాతం పన్ను విధించింది. పాపులేటెడ్‌ ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డు వంటి దిగుమతి చేసుకునే కీలక పరికరాలపై ఈ పన్ను విధిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. పీసీబీలపై 10 శాతం కస్టమ్స్‌ డ్యూటీని విధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం సోమవారం ఓ నోటిఫికేషన్‌ను జారీచేసింది. పాపులేటెడ్‌ పీఎస్‌బీలు ఖర్చు స్మార్ట్‌ఫోన్‌ తయారీ ఖర్చులో సగం భాగముంటున్నాయి. ఈ నేపథ్యంలో మొబైల్‌ డివైజ్‌ల తయారీలో స్థానికతను పెంచి, ఖర్చులను తగ్గించడానికి కీలక స్మార్ట్‌ఫోన్‌ పరికరాలపై దిగుమతి సుంకాన్ని విధించింది. 

ఫోన్ల కెమెరా మాడ్యుల్స్‌, కనెక్టర్స్‌ వంటి పరికరాలపై కూడా 10 శాతం కస్టమ్స్‌ డ్యూటీని ప్రభుత్వం విధించింది. కాగ, ప్రభుత్వం విధిస్తున్న పన్నులు ప్రధానమంత్రి దశల వారీ తయారీ ప్రొగ్రామ్‌లో భాగంగా విధిస్తున్నారు. ఈ ప్లాన్‌ను 2016లో ప్రభుత్వం ఆవిష్కరించింది. భారత్‌ను కూడా చైనా మాదిరి తయారీ రంగానికి పవర్‌హౌజ్‌గా మార్చాలని ప్రధాని భావిస్తున్నారు. ఈ క్రమంలో బ్యాటరీలు, ఛార్జర్లు, ఇయర్‌ఫోన్లు తక్కువ విలువున్న పరికరాలపై కూడా మెల్లమెల్లగా దిగుమతి సుంకాలను ప్రభుత్వం పెంచుతోంది. అయితే భారత్‌ విధిస్తున్న ఈ దిగుమతి సుంకాలపై చైనా, కెనడా, అమెరికా దేశాలు వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ వద్ద తమ ఆందోళనను వెల్లబుచ్చుకుంటున్నాయి.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top