4 వారాల్లో నిర్ణయించండి... | In the case of confiscating passports | Sakshi
Sakshi News home page

4 వారాల్లో నిర్ణయించండి...

Jun 6 2014 12:46 AM | Updated on Aug 31 2018 8:26 PM

4 వారాల్లో నిర్ణయించండి... - Sakshi

4 వారాల్లో నిర్ణయించండి...

డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్‌ఎల్) చైర్మన్, వైస్ చైర్మన్లు టి.వెంకట్రామిరెడ్డి, టి.వినాయక్ రవిరెడ్డిల పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకునే విషయంలో నాలుగు వారాల్లోపు నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు గురువారం ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి (ఆర్‌పీవో)ని ఆదేశించింది.

 డీసీ చైర్మన్, ైవె స్ చైర్మన్ల పాస్‌పోర్టుల స్వాధీనంపై హైకోర్టు
 
సాక్షి, హైదరాబాద్: డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్‌ఎల్) చైర్మన్, వైస్ చైర్మన్లు టి.వెంకట్రామిరెడ్డి, టి.వినాయక్ రవిరెడ్డిల పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకునే విషయంలో నాలుగు వారాల్లోపు నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు గురువారం ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి (ఆర్‌పీవో)ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు.
 
రెలిగేర్ సంస్థ నుంచి డెక్కన్ క్రానికల్ దాదాపు రూ.260 కోట్ల మేర రుణం తీసుకుంది. ఈ మొత్తాల చెల్లింపు విషయంలో అటు రెలిగేర్‌కు, ఇటు డెక్కన్ క్రానికల్‌కు వివాదం నడుస్తోంది. దేశంలోని పలు కోర్టుల్లో డీసీహెచ్‌ఎల్‌పై కేసులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వెంకట్రామిరెడ్డి, వినాయక్వ్రిరెడ్డిలు విదేశాలకు వెళ్లిపోయే అవకాశాలున్నాయని, అందువల్ల వారి పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకునేలా ఆర్‌పీవోను ఆదేశించాలని రెలిగేర్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. పాస్‌పోర్ట్‌ల స్వాధీనం నిమిత్తం తాము ఏడాది క్రితం వినతిపత్రం ఇచ్చినా కూడా ఆర్‌పీవో ఇప్పటి వరకు దానిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి, రెలిగేర్ వినతిపత్రం నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆర్‌పీవోను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement