breaking news
T. Venkatrami Reddy
-
దక్కన్ క్రానికల్ చైర్మన్ కు మాతృవియోగం
హైదరాబాద్: దక్కన్ క్రానికల్ చైర్మన్ టి.వెంకట్రామిరెడ్డి తల్లి టి.ఊర్మిళాచంద్రశేఖర్‌రెడ్డి(82) గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని తన స్వగృహంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు కాగా వారిలో ఒకరైన వెంకట్రామిరెడ్డి దక్కన్ క్రానికల్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె అంత్యక్రియులు గురువారం పంజగుట్ట శ్మశానవాటికలో జరిగాయి. రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డితోపాటు పలువురు ప్రముఖులు ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
4 వారాల్లో నిర్ణయించండి...
డీసీ చైర్మన్, ైవె స్ చైర్మన్ల పాస్‌పోర్టుల స్వాధీనంపై హైకోర్టు సాక్షి, హైదరాబాద్: డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) చైర్మన్, వైస్ చైర్మన్లు టి.వెంకట్రామిరెడ్డి, టి.వినాయక్ రవిరెడ్డిల పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకునే విషయంలో నాలుగు వారాల్లోపు నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు గురువారం ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి (ఆర్పీవో)ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. రెలిగేర్ సంస్థ నుంచి డెక్కన్ క్రానికల్ దాదాపు రూ.260 కోట్ల మేర రుణం తీసుకుంది. ఈ మొత్తాల చెల్లింపు విషయంలో అటు రెలిగేర్‌కు, ఇటు డెక్కన్ క్రానికల్‌కు వివాదం నడుస్తోంది. దేశంలోని పలు కోర్టుల్లో డీసీహెచ్‌ఎల్‌పై కేసులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వెంకట్రామిరెడ్డి, వినాయక్వ్రిరెడ్డిలు విదేశాలకు వెళ్లిపోయే అవకాశాలున్నాయని, అందువల్ల వారి పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకునేలా ఆర్‌పీవోను ఆదేశించాలని రెలిగేర్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. పాస్‌పోర్ట్‌ల స్వాధీనం నిమిత్తం తాము ఏడాది క్రితం వినతిపత్రం ఇచ్చినా కూడా ఆర్పీవో ఇప్పటి వరకు దానిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి, రెలిగేర్ వినతిపత్రం నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆర్‌పీవోను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.