దక్కన్ క్రానికల్ చైర్మన్ కు మాతృవియోగం | deccan chronical chairman's mother died | Sakshi
Sakshi News home page

దక్కన్ క్రానికల్ చైర్మన్ కు మాతృవియోగం

Feb 26 2016 4:24 AM | Updated on Sep 3 2017 6:25 PM

దక్కన్ క్రానికల్ చైర్మన్ కు మాతృవియోగం

దక్కన్ క్రానికల్ చైర్మన్ కు మాతృవియోగం

దక్కన్ క్రానికల్ చైర్మన్ టి.వెంకట్రామిరెడ్డి తల్లి టి.ఊర్మిళాచంద్రశేఖర్‌రెడ్డి(82) గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని తన స్వగృహంలో కన్నుమూశారు.

హైదరాబాద్: దక్కన్ క్రానికల్ చైర్మన్ టి.వెంకట్రామిరెడ్డి తల్లి టి.ఊర్మిళాచంద్రశేఖర్‌రెడ్డి(82) గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని తన స్వగృహంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు కాగా వారిలో ఒకరైన వెంకట్రామిరెడ్డి దక్కన్ క్రానికల్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె అంత్యక్రియులు గురువారం పంజగుట్ట శ్మశానవాటికలో జరిగాయి. రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డితోపాటు పలువురు ప్రముఖులు ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement