ఐడియా  నిధుల సమీకరణ! 

Idea fund raising - Sakshi

క్యూఐపీలో రూ.3,500 కోట్లకు ప్రణాళిక 

న్యూఢిల్లీ: ఐడియా సెల్యులర్‌ కంపెనీ రూ.3,500 కోట్లు సమీకరించనున్నది. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌(క్యూఐపీ) విధానంలో ఈక్విటీ షేర్ల జారీ ద్వారా ఈ పెట్టుబడులు సమీకరిస్తామని ఐడియా సెల్యులర్‌ తెలిపింది. ఈ నిధుల సమీకరణకు  తమ కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ తుది ఆమోదం తెలిపిందని పేర్కొంది. కంపెనీ ప్రమోటర్‌ ఆదిత్య బిర్లా గ్రూప్‌(ఏబీజీ)కు చెందిన సంస్థలకు షేర్ల కేటాయింపు ద్వారా ఇటీవలనే ఈ కంపెనీ రూ.3,250 కోట్లు సమీకరించింది.

ఐపీ ద్వారా రూ.3,500 కోట్లు, ఏబీజీ ద్వారా రూ.3,250 కోట్లు.. మొత్తం రూ.6,750 కోట్ల నిధుల  కారణంగా ఐడియా నికర రుణ భారం తగ్గుతుంది. గత ఏడాది డిసెంబర్‌ చివరి నాటికి ఐడియా నికర రుణ భారం రూ.55,782 కోట్లుగా ఉంది. కాగా వొడాఫోన్‌ కంపెనీ ఐడియాలో విలీనమవుతున్న విషయం తెలిసిందే.     

Tags: 
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top