ఐసీఐసీఐ బంపర్‌ ఆఫర్‌ | ICICI Bank offers unlimited free ATM transactions to working women | Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐ బంపర్‌ ఆఫర్‌

Dec 13 2018 5:34 PM | Updated on Dec 13 2018 7:40 PM

ICICI Bank offers unlimited free ATM transactions to working women - Sakshi

సాక్షి, ముంబై: ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ మహిళా ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. భారతదేశంలో ఉద్యోగినులకు అన్‌లిమిటెడ్‌ ఏటీఎం ట్రాన్సాక్షన్స్‌, ఉచిత బీమా  క్యాష్‌ బ్యాక్‌, డిస్కౌంట్లు లాంటి  అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఉద్యోగినులతోపాటు, గృహ వ్యాపారాన్ని నడుపుతున్న,  స్వయం ఉపాధి పొందుతున్న విద్యావేత్తలు, వృత్తి నిపుణులైన మహిళలకు ఈ ఖాతా తెరిచే అవకాశం కల్పిస్తున్నట్టు  ఐసీఐసీఐ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.
 
‘అడ్వాంటేజ్ ఉమన్ ఔరా సేవింగ్స్ అకౌంట్‌’  పేరుతో ఉద్యోగినులకు ప్రత్యేక ఖాతాను అందిస్తోంది. ఈ అకౌంట్‌ తీసుకున్న వారికి డెబిట్‌ కార్డ్‌ వాడకంపై నెలకు రూ.750 క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను ప్రకటించింది.  అలాగే ఏటీఎం లావాదేవీలు పూర్తిగా ఉచితం. లాకర్‌ చార్జీలపై 50 శాతం డిస్కౌంట్‌, గృహ రుణాల ప్రాసెసింగ్‌ ఫీజులో డిస్కౌంట్‌.  ద్విచక్ర వాహనాలపై వంద శాతం రుణ మంజూరీ వంటి అనేక ఆఫర్లను ఈ ఖాతా ద్వారా పొందవచ్చని  ఐసీఐసీఐ బ్యాంకు వెల్లడించింది. అంతేకాదు 10-40లక్షల రూపాయల దాకా ఉచిత ప్రమాద బీమా సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. 

అటు ఇల్లు, ఇటు ఆఫీసు వ్యవహారాలను సంపూర్ణ సమతుల‍్యంతో నిర్వహిస్తున్న​ ఉద్యోగినులకు సలాం చేస్తున్నామని, ఇలాంటి మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రత్యేక ఖాతాను అందుబాటులోకి తెచ్చామని ఐసీఐసీఐ బ్యాంకు రిటైల్ లయబిలిటీస్ గ్రూప్  హెడ్ ప్రణవ్ మిశ్రా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement