ఐబాల్ నుంచి కోబాల్ట్4 | iBall Launches mSLR Cobalt 4 with Detachable Lenses in India | Sakshi
Sakshi News home page

ఐబాల్ నుంచి కోబాల్ట్4

Jun 16 2015 1:41 AM | Updated on Nov 6 2018 5:26 PM

ఐబాల్ నుంచి కోబాల్ట్4 - Sakshi

ఐబాల్ నుంచి కోబాల్ట్4

ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ఐబాల్ తన కోబాల్ట్ సిరీస్‌లో ‘ఎంఎస్‌ఎల్‌ఆర్ కోబాల్ట్4’ అనే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది...

- ఫోన్‌తోపాటు 4 డిటాచబుల్ లె న్స్
- ధర రూ.8,499
ముంబై:
ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ఐబాల్ తన కోబాల్ట్ సిరీస్‌లో ‘ఎంఎస్‌ఎల్‌ఆర్ కోబాల్ట్4’ అనే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.8,499. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టాకోర్ ప్రాసెసర్, 5 అంగుళాల హెచ్‌డీ తెర, 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 ప్రాంతీయ భాషల సపోర్ట్, ఫ్లాష్‌తో కూడిన 8 ఎంపీ రియర్ కెమెరా, ఫ్లాష్ ఉన్న 3.2 ఫ్రంట్ కెమెరా, 8 జీబీ మెమరి, డ్యూయెల్ సిమ్, 3జీ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ రియర్ కెమెరా ఫిష్‌ఐ లెన్స్, మైక్రో లెన్స్ (10ఎక్స్ జూమ్) వైడ్ యాంగిల్ లెన్స్, 8ఎక్స్ జూమ్ లెన్స్ అనే నాలుగు డిటాచబుల్ లెన్స్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇవి ఫోన్‌తోపాటు వస్తాయి. వీటి వల్ల మంచి నాణ్యత గల ఫొటోలను తీసుకోవడం వీలవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement