హైదరాబాద్‌లో అతిపెద్ద వన్‌ప్లస్‌ స్టోర్‌ | Hyderabad to get World Largest OnePlus store | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో అతిపెద్ద వన్‌ప్లస్‌ స్టోర్‌

May 15 2019 2:14 PM | Updated on May 15 2019 2:32 PM

Hyderabad to get World Largest OnePlus store - Sakshi

సాక్షి,  ముంబై :  చైనా స్మార్ట్‌ఫోన్‌​ దిగ్గజ  బ్రాండ్‌ వన్‌ప్లస్‌ అతిపెద్ద వన్‌ప్లస్‌ స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. మంగళవారం బెంగళూరులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో  రెండు ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్లు  వన్‌ప్లస్‌ 7, 7 ప్రొ ఆవిష్కరింది.  సందర్భంగా  కంపెనీ ఈ విషయాన్ని ప్రకటించింది. అలాగే ముంబై, పుణేలలో రెండు  ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్లను ప్రారంభించినట్టు తెలిపింది. 

16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు అంతస్థుల భవనంలో అతిపెద్ద వన్‌ ప్లస్‌ స్టోర్‌ను ఏర్పాటు చేయనున్నామని కంపెనీ సీఈవో  పీట్‌ లౌ వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి  దీన్ని పూర్తి చేయాలని భావిస్తున్నామన్నారు. దీనికి సంబంధించిన పనులను ఇప్పటికే ప్రారంభించనట్టు తెలిపారు. గొప్ప సాంస్కృతిక కేంద్రంగానే కాకుండా ఐటీ, టెక్నాలజీ హబ్‌గా హైదరాబాద్‌కు పేరుందన్నారు.

పాత కొత్త టెక్నాలజీల మధ్య వారధిగా వన్‌ప్లస్‌ నిలుస్తుందన్నారు పీట్‌.  సంప్రదాయ  హైదరాబాద్‌ ఎర్ర ఇటుకలతో, దుమ్మును ఆకర్షించని శ్వేత సౌధాన్ని అద్భుతమైన డిజైన్‌, సహజకాంతితో తీర్చిదిద్దునున్నట్టు ఆయన వెల్లడించారు. కాగా వన్‌ప్లస్‌కు ఇప్పటికే హైదరాబాద్‌లో ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌  ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement