బిగ్గర్‌ ఫర్‌ బెటర్‌.. హువావే వై 9

 Huawei Y9 (2019) With Dual Rear, Front Cameras Launched in India - Sakshi

చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు హువావే మరో స్మార్ట్‌ఫోన్‌ను  భారత  మార్కెట్లో లాంచ్‌ చేసింది. వై సిరీస్‌లో  భాగంగా తొలి స్మార్ట్‌ఫోన్‌ను వై 9 పేరుతో  నేడు (జనవరి 10) విడుదల చేసింది. బిగ్గర్‌ ఫర్‌ బెటర్‌.. ముందూ, వెనక  మొత్తం నాలుగు బిగ్‌ కెమెరాలతో.. యూజర్లు ఫోటోగ్రఫీలో మాస్టర్‌ అయిపోతారంటూ లాంచింగ్‌ సందర్బంగా కంపెనీ వ్యాఖ్యానించింది. కాగా ఆ స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పటికే చైనాలో గత ఏడాది తీసుకొచ్చింది. 

జనవరి 15నుంచి అమెజాన్‌ద్వారా  ప్రత్యేకంగా విక్రయానికి అందుబాటులో ఉండనుంది. 

వై 9 ఫీచర్లు
6.5 అంగుళాల ఎల్‌సీడీ  డిస్‌ప్లే
2340x1080 రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో
2.2 ఆక్టాకోర్‌  కిరిన్‌ 710 సాక్‌
4జీబీ,  64జీబీ స్టోరేజ్‌
256దాకా స్టోరేజ్‌ను విస్తరించుకునే అవకాశం
16+2ఎంపీ  డ్యుయల్‌ రియర్‌కెమెరా
13+2 ఎంపీ డ్యుయల్‌  సెల్ఫీ కెమెరా
4000ఎంఏహెచ్‌ బ్యాటరీ
ధర : రూ.15,999

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top