కౌంటర్‌ వద్ద తీసుకున్న టిక్కెట్లను క్యాన్సిల్‌ చేయడమెలా?

How To Cancel Tickets Bought At Counters Online Through IRCTC - Sakshi

న్యూఢిల్లీ : దేశీయ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) టిక్కెట్లను రద్దు చేసుకోవడంలో మరో సరికొత్త సౌకర్యాన్ని కల్పిస్తోంది. కౌంటర్స్‌ వద్ద ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన టిక్కెట్లను రద్దు చేసుకునే సౌకర్యాన్ని కూడా ఐఆర్‌సీటీసీలో తన ప్రయాణికులకు అందిస్తుంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా యాప్‌ ద్వారా టిక్కెట్లను బుక్‌ చేసుకున్న వారికి, ఇప్పటికే ఈ ప్రాసెస్‌ ఎలా ఉంటుందో తెలిసిందే ఉంటుంది. కానీ కౌంటర్స్‌ వద్ద ఆన్‌లైన్‌లో టిక్కెట్లను బుక్‌ చేసుకునే వారికి దీనిపై ఎద్ద అవగాహన ఉండదు. అంతకముందు కౌంటర్లో తీసుకున్న టిక్కెట్లను రద్దు చేసుకోవాలంటే, తిరిగి కౌంటర్‌కే వెళ్లేవారు. ప్రస్తుత ప్రక్రియను ఐఆర్‌సీటీసీ ద్వారా కూడా అందిస్తున్నారు. 

అది ఎలానో ఓ సారి చూడండి....

  • ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. ఆ సైట్‌లో ట్రైన్స్‌ సెక్షన్‌ కింద ఉన్న క్యాన్సిల్‌ టిక్కెట్‌ను క్లిక్‌ చేయాలి. దానిలో కౌంటర్‌ టిక్కెట్‌ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.
  • పీఎన్‌ఆర్‌ నెంబర్‌, ట్రైన్‌ నెంబర్‌, పేజీలో చూపించే క్యాప్‌చాను నమోదు చేయాలి. ‘క్యాన్సిలేషన్‌ లేదా బోర్డింగ్‌ పాయింట్‌ మార్పు ప్రక్రియను చదివాను’ అనే మెసేజ్‌ కనిపిస్తున్న బాక్స్‌ను చెక్‌ చేసుకోవాలి. ఆ అనంతరం ‘సబ్‌మిట్‌’ బటన్‌ నొక్కాలి.
  • ఒక్కసారి ‘సబ్‌మిట్‌’ బటన్‌ను క్లిక్‌ చేసిన తర్వాత, బుకింగ్‌ సమయంలో మీరిచ్చిన మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
  • క్యాన్సిలేషన్‌ కోసం ఈ ఓటీపీని నమోదు చేయాలి. 
  • ఓటీపీ వాలిడేట్‌ అయితే, స్క్రీన్‌పై పీఎన్‌ఆర్‌ వివరాలు కనిపిస్తాయి. అన్ని వివరాలను వెరిఫై చేసుకున్నాక, ‘క్యాన్సిల్‌ టిక్కెట్‌’ అనే దానిపై క్లిక్‌ చేయాలి. స్క్రీన్‌పై చూపించిన మొత్తం రీఫండ్‌ అవుతుంది. 
  • మీరు రిజిస్ట్రర్‌ చేసిన మొబైల్‌ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌, పీఎన్‌ఆర్‌ నెంబర్‌, రీఫండ్‌ వివరాలను మెసేజ్‌ ద్వారా ఐఆర్‌సీటీసీ పంపుతోంది. 

కౌంటర్‌ వద్ద తీసుకున్న టిక్కెట్‌ను రద్దు చేసుకోవాలంటే పాటించాల్సిన నిబంధనలు : 

  • బుకింగ్‌ సమయంలో వాలిడ్‌ మొబైల్‌ నెంబర్‌ ఇచ్చిన వారికే ఇది అందుబాటు.
  • సాధారణ పరిస్థితులలో మాత్రమే పిఆర్ఎస్ కౌంటర్ టిక్కెట్ల కోసం టిక్కెట్ల రద్దు, ఛార్జీల వాపసును అనుమతిస్తుంది.
  • టిక్కెట్‌ పూర్తిగా ధృవీకరణ అయ్యాక, ఆన్‌లైన్‌గా రద్దు చేపట్టాలంటే, రైలు ప్రారంభం కావాడానికి కంటే 4 గంటల ముందు మాత్రమే అనుమతిస్తుంది.
  • ఆర్‌ఏసీ లేదా వెయిట్‌లిస్ట్‌ వారు 30 నిమిషాల ముందు ఆన్‌లైన్‌ క్యాన్సిలేషన్‌ చేపట్టుకోవచ్చు. 
     
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top