ఇన్ఫీ సిక్కాపై ‘హౌసింగ్ ’ రాహుల్ విసుర్లు | Housing.com’s Rahul Yadav takes a dig at Infosys CEO Vishal Sikka | Sakshi
Sakshi News home page

ఇన్ఫీ సిక్కాపై ‘హౌసింగ్ ’ రాహుల్ విసుర్లు

Jun 6 2015 12:44 AM | Updated on Sep 3 2017 3:16 AM

ఇన్ఫీ సిక్కాపై ‘హౌసింగ్ ’ రాహుల్ విసుర్లు

ఇన్ఫీ సిక్కాపై ‘హౌసింగ్ ’ రాహుల్ విసుర్లు

ఇతర కంపెనీల సీఈవోలపై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కే హౌసింగ్‌డాట్‌కామ్ సీఈవో రాహుల్ యాదవ్ ఈసారి ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కాను టార్గెట్ చేశారు...

సిక్కా కునుకు తీస్తున్న ఫొటో ఫేస్‌బుక్‌లో పోస్టింగ్
న్యూఢిల్లీ:
ఇతర కంపెనీల సీఈవోలపై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కే హౌసింగ్‌డాట్‌కామ్ సీఈవో రాహుల్ యాదవ్ ఈసారి ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కాను టార్గెట్ చేశారు. ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో కునుకు తీస్తున్న సిక్కా ఫొటోను సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు యాదవ్. దాంతో పాటు తామిద్దరి మధ్య జరిగిన సంభాషణనూ పోస్ట్ చేశారు. ‘నేను ఆయన్ను ఏదో అడగబోయాను.

కానీ ఆయన కనీసం నా ప్రశ్న కూడా వినలేదు. పైగా నాకు నిద్రపోవాలనుంది అంటూ సమాధానమిచ్చారు’ అంటూ యాదవ్ పేర్కొన్నారు. హౌసింగ్‌డాట్‌కామ్‌లో తన వాటాలను ఉద్యోగులకు ఇస్తున్నట్లు ప్రకటించిన యాదవ్ ఇటీవలే ట్యాక్సీ సర్వీసుల సంస్థ ఓలా, జొమాటో సీఈవో దీపిందర్ గోయల్‌పై సెటైర్లు వేశారు. వారు కూడా తమ కంపెనీల్లో సగం వాటాలను ఉద్యోగులకు ఇచ్చేయాలంటూ సవాల్ విసిరారు. ఏడేళ్ల నుంచి మెనూలు స్కానింగ్ చేయడం తప్ప కొత్తగా ఏదీ చేయలేదంటూ జొమాటోపై యాదవ్ కామెంట్ చేశారు. హౌసింగ్‌డాట్‌కామ్‌లో ఇన్వెస్టర్లతో కూడా దురుసుగా వ్యవహరించిన యాదవ్ ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement