Infosys CEO Vishal sicca
-
ఇన్ఫీ సిక్కాపై ‘హౌసింగ్ ’ రాహుల్ విసుర్లు
సిక్కా కునుకు తీస్తున్న ఫొటో ఫేస్బుక్లో పోస్టింగ్ న్యూఢిల్లీ: ఇతర కంపెనీల సీఈవోలపై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కే హౌసింగ్‌డాట్‌కామ్ సీఈవో రాహుల్ యాదవ్ ఈసారి ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కాను టార్గెట్ చేశారు. ఎయిర్పోర్ట్ లాంజ్‌లో కునుకు తీస్తున్న సిక్కా ఫొటోను సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు యాదవ్. దాంతో పాటు తామిద్దరి మధ్య జరిగిన సంభాషణనూ పోస్ట్ చేశారు. ‘నేను ఆయన్ను ఏదో అడగబోయాను. కానీ ఆయన కనీసం నా ప్రశ్న కూడా వినలేదు. పైగా నాకు నిద్రపోవాలనుంది అంటూ సమాధానమిచ్చారు’ అంటూ యాదవ్ పేర్కొన్నారు. హౌసింగ్‌డాట్‌కామ్‌లో తన వాటాలను ఉద్యోగులకు ఇస్తున్నట్లు ప్రకటించిన యాదవ్ ఇటీవలే ట్యాక్సీ సర్వీసుల సంస్థ ఓలా, జొమాటో సీఈవో దీపిందర్ గోయల్‌పై సెటైర్లు వేశారు. వారు కూడా తమ కంపెనీల్లో సగం వాటాలను ఉద్యోగులకు ఇచ్చేయాలంటూ సవాల్ విసిరారు. ఏడేళ్ల నుంచి మెనూలు స్కానింగ్ చేయడం తప్ప కొత్తగా ఏదీ చేయలేదంటూ జొమాటోపై యాదవ్ కామెంట్ చేశారు. హౌసింగ్‌డాట్‌కామ్‌లో ఇన్వెస్టర్లతో కూడా దురుసుగా వ్యవహరించిన యాదవ్ ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు. -
ఇన్ఫోసిస్ చేతికి అమెరికా కంపెనీ
- ‘పనయా’ కొనుగోలు - డీల్ విలువ రూ. 1,245 కోట్లు బెంగళూరు: సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా అమెరికాకు చెందిన ఆటోమేషన్ టెక్నాలజీసంస్థ ‘పనయా’ని కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 200 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,245 కోట్లు) ఉంటుందని ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా సోమవారం తెలిపారు. మరింత వైవిధ్యమైన కొత్త సర్వీసులు అందించేందుకు పనయా కొనుగోలు ఉపయోగపడగలదని వివరించారు. తమ క్లయింట్లు వ్యయాలు, రిస్కులను తగ్గించుకునేందుకు పనయా సేవలు తోడ్పడగలవని సిక్కా పేర్కొన్నారు. మార్చి 31 నాటికల్లా ఈ డీల్ పూర్తి కాగలదని ఆయన పేర్కొన్నారు. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ సర్వీసుల మార్కెట్లో ఇన్ఫీ స్థానాన్ని మరింత పటిష్టం చేయడానికి ఇది తోడ్పడగలదని పనయా సీఈవో డొరొన్ గెర్స్టెల్ తెలిపారు. న్యూజెర్సీ కేంద్రంగా పనిచేసే పనయా.. క్లౌడ్ ఆధారిత సర్వీసులు అందిస్తోంది. కోక కోలా, మెర్సిడెస్-బెంజ్, యూనిలీవర్ వంటి సంస్థలు పనయా క్లయింట్లుగా ఉన్నాయి. ఇన్ఫోసిస్ 2012 సెప్టెంబర్‌లో జ్యూరిక్కి చెందిన లోడ్‌స్టోన్ హోల్డింగ్‌ను కొన్న తర్వాత ఇది రెండో భారీ డీల్. ప్రస్తుతం ఇన్ఫీ వద్ద దాదాపు రూ. 32,000 కోట్ల నగదు నిల్వలున్నాయి.