మార్కెట్లోకి హోండా చౌక ఎస్యూవీ ... బీఆర్-వీ | Honda launches BR-V compact SUV at Rs 8.75 lakh | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి హోండా చౌక ఎస్యూవీ ... బీఆర్-వీ

May 6 2016 1:25 AM | Updated on Sep 3 2017 11:28 PM

మార్కెట్లోకి హోండా చౌక ఎస్యూవీ ... బీఆర్-వీ

మార్కెట్లోకి హోండా చౌక ఎస్యూవీ ... బీఆర్-వీ

హోండా కార్స్ ఇండియా... బీఆర్-వీ మోడల్‌తో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్(ఎస్‌యూవీ) సెగ్మెంట్లో ప్రవేశించింది.

ధరలు రూ.8.75 లక్షల నుంచి రూ.12.9 లక్షల రేంజ్‌లో

ఎస్‌యూవీ ప్రత్యేకతలు...:  4 వేరియంట్లలలో లభ్యమయ్యే ఈ ఎస్‌యూవీలో బ్లాక్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, స్టార్ట్/స్టాప్ బటన్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రూఫ్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ తదితర ఫీచర్లున్నాయి. పెట్రోల్ వేరియంట్ మైలేజీ 16 కిమీ కాగా... డీజిల్ వేరియంట్ 21.9 కిమీ మైలేజీని ఇస్తుందని కంపెనీ తెలిపింది.

న్యూఢిల్లీ: హోండా కార్స్ ఇండియా... బీఆర్-వీ మోడల్‌తో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్(ఎస్‌యూవీ) సెగ్మెంట్లో ప్రవేశించింది.  ఈ ఎస్‌యూవీని పెట్రోల్ డీజిల్ వేరియంట్లలో అందిస్తున్నామని  హోండా కార్స్ ఇండియా తెలిపింది. పెట్రోల్ వేరియంట్‌ల ధరలు రూ.8.7 లక్షల నుంచి రూ.11.84 లక్షలు, డీజిల్ వేరియంట్‌ల ధరలు రూ.9.9 లక్షల నుంచి రూ.12.9 లక్షల రేంజ్‌లో ఉన్నాయని  హోండా కార్స్ ఇండియా(హెచ్‌సీఐఎల్) ప్రెసిడెంట్, సీఈఓ యోచిరో యుఇనో పేర్కొన్నారు. ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.11.99 లక్షలని (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)  పేర్కొన్నారు. హ్యుందాయ్ క్రెటా, రెనో డస్టర్  ఎస్‌యూవీలకు ఈ బీఆర్-వీ ఎస్‌యూవీ గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement