టాప్ సెల్లింగ్ టూవీలర్గా హోండా యాక్టివా | Honda Activa pips Hero's Splendor as best selling 2-wheeler | Sakshi
Sakshi News home page

టాప్ సెల్లింగ్ టూవీలర్గా హోండా యాక్టివా

Jul 20 2016 8:37 AM | Updated on Sep 4 2017 5:19 AM

టాప్ సెల్లింగ్ టూవీలర్గా హోండా యాక్టివా

టాప్ సెల్లింగ్ టూవీలర్గా హోండా యాక్టివా

దేశంలో ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో అత్యధికంగా అమ్ముడుపోయిన టూవీలర్‌గా హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ)కు చెందిన ‘యాక్టివా’ అవతరించింది.

న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది తొలి అర్ధ భాగ ంలో అత్యధికంగా అమ్ముడుపోయిన టూవీలర్‌గా హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ)కు చెందిన ‘యాక్టివా’ అవతరించింది. ఇది వరకు ఈ రికార్డు హీరో మోటోకార్ప్‌కు చెందిన స్ల్పెండర్ సిరీస్ పేరిట ఉండేది. అలాగే గత 17 ఏళ్లలో అత్యధికంగా అమ్ముడుపోయిన టూవీలర్లలో బైక్స్‌దే ఆధిపత్యం. కాగా ఇప్పుడు హోండా యాక్టివా, బైక్స్ దూకుడుకు కళ్లెం వేసింది. సియామ్ గణాంకాల ప్రకారం..

ఈ ఏడాది తొలి ఆరు నెలలో (జనవరి-జూన్) యాక్టివా టూవీలర్స్ విక్రయాలు 13,38,015 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో హీరో స్ల్పెండర్ సిరీస్ వాహన విక్రయాలు 12,33,725 యూనిట్లుగా ఉన్నాయి.కాగా హెచ్‌ఎంఎస్‌ఐ.. తన యాక్టివా శ్రేణిలో యాక్టివా 3జీ, యాక్టివా 125, యాక్టివా ఐ అనే మూడు వాహనాలను వినియోగదారులకు అందిస్తోంది. ఇక హీరో కంపెనీ తన స్ల్పెండర్ సిరీస్‌లో భాగంగా సూపర్ స్ల్పెండర్, స్ల్పెండర్ ప్లస్, స్ల్పెండర్ ప్రొ, స్ల్పెండర్ ప్రొ క్లాసిక్, స్ల్పెండర్ ఐస్మార్ట్ మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement