‘ఆ ప్రకటనలకు దూరం’

HC Restrains OLX Quikr From Posting Fake Reliance Job Ads On Web Portals - Sakshi

ఓఎల్‌ఎక్స్‌, క్వికర్‌లో నకిలీ ప్రకటనలపై ఫైర్‌

సాక్షి, న్యూఢిల్లీ : ఒఎల్‌ఎక్స్‌, క్వికర్‌లు తమ వెబ్‌సైట్లలో రిలయన్స్‌ జియో పేరిట నకిలీ ఉద్యోగ ప్రకటనలు పొందుపరచడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రకటనలకు దూరంగా ఉండాలని ఒఎల్‌ఎక్స్‌, క్వికర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిడెట్‌లను ఆదేశించింది. జియో జాబ్స్‌, రిలయన్స్‌ ట్రెండ్స్‌ జాబ్స్‌ అనే వర్డ్స్‌ను ఉపయోగిస్తూ నకిలీ ప్రకటనలు ఇవ్వడంతో రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రతిష్ట, గుడ్‌విల్‌ దెబ్బతింటాయని ఆర్‌ఐఎల్‌ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది.

ఈ కేసులో ఆర్‌ఐఎల్‌, రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌కు అనుకూలంగా ప్రాథమిక ఆధారాలు ఉన్నందున మధ్యంతర ఊరట కల్పిచని పక్షంలో వారికి  తీవ్ర నష్టం వాటిల్లుతుందని జస్టిస్‌ ముక్తా గుప్తా రెండు వేర్వేరు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జియో, రిలయన్స్‌ ట్రేడ్‌మార్క్‌లకు తాము సొంతదారులమని ఓఎల్‌ఎక్స్‌, క్వికర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లు తమ గుడ్‌విల్‌కు, ప్రతిష్టకు తీరని హాని కలిగించేలా వ‍్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ ఆర్‌ఐఎల్‌ దాఖలు చేసిన రెండు పిటిషన్లపై హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

చదవండి : మరో మెగాడీల్‌కు జియో రెడీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top